
జుబీన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అరెస్టు..
బ్యాంకు ఖాతాల్లోకి భారీగా నగదు ట్రాన్స్‌ఫర్..
అస్సాం(Assam) ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) అనుమానాస్పద మృతి కేసులో ఆయన భద్రతా సిబ్బందిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. జుబీన్‌కు భద్రతా సిబ్బందిగా ప్రభుత్వం నందీశ్వర్ బోరా, పరేష్ బైశ్యాలను నియమించింది. గార్గ్ మృతిపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు వీరిద్దరిని కూడా అరెస్టు చేసి ప్రశ్నించారు. వీరి బ్యాంకు ఖాతాల్లో బ్యాంకు ఖాతాల్లో్కి పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ జరిగినట్లు గుర్తించిన అనంతరం పోలీసు ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. వీరిద్దరితో కలిపి ఇప్పటివరకు గార్గ్ మృతి కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. అంతకుముందు నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యామ్‌కను మహంత, గార్గ్ సమీప బంధువు సందీపన్ గార్గ్, అతని మేనేజర్ సిద్ధార్థ శర్మ, గార్గ్ బృందంలోని సంగీతకారుడు శేఖర్జ్యోతి గోస్వామి, గాయకుడు అమృతప్రవ మహంతలను అరెస్టు చేశారు.
సింగపూర్(Singapore)లో నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో గార్గ్ ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లారు. అక్కడ సెప్టెంబర్ 19న సముద్రంలో ఈత కొడుతూ మరణించారు. ఆయన మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం చేశారు. స్వదేశానికి ఆయన భౌతికకాయాన్ని తీసుకువచ్చాక.. రెండో సారి గౌహతిలో ఆయన మృతదేహానికి రెండో సారి పోస్టు మార్టం చేశారు.