
‘25 మంది మృతికి సిలిండర్ పేలుడు ఒక్కటే కారణం కాదు’
అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నదేమిటి? దర్యాప్తులో తేలిందేమిటి?
గోవా(Goa) నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగి 25 మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డ విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ప్రమాదం (Fire accident) జరిగినపుడు క్లబ్లో దాదాపు 100 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. గ్యాస్ సిలిండర్ పేలుడం వల్ల మంటల వ్యాపించాయన్నది ప్రాథమిక సమాచారం.
ఇంకేమైనా కారణాలున్నాయా?
గ్యాస్ సిలిండర్ పేలుడే ఇంతమంది మరణానికి కారణమా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వారి విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎంట్రీ, ఎక్సిట్ చాలా చిన్నవి..
పనాజీ నుంచి 25 కి.మీ దూరంలో ‘‘బిర్చ్ బై రోమియో లేన్’’ పేరిట ఓ నైట్ క్లబ్ ఏర్పాటు చేశారు. అర్పోరా నది బ్యాక్ వాటర్స్ సమీపంలో నిర్మించిన ఈ క్లబ్‌ను నిర్వాహకులు "ఐలాండ్ క్లబ్"గా ప్రమోట్ చేశారు. ఈ క్లబ్‌కు ఒకే ఎంట్రీ, ఒకే ఎక్సిట్ ఉన్నాయి. అవి కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి.
వెంటిలేషన్ లేని బేస్మెంట్..
కొంతమంది క్లబ్ బేస్మెంట్ చనిపోయారు. పనిచేసే సిబ్బందే ఎక్కువగా ఉండే ఈ బేస్మెంట్కు వెంటిలేషన్ లేదని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. కాలిన గాయాలతో ముగ్గురు చనిపోగా.. మిగిలిన వారు పొగ పీల్చడం వల్ల మరణించినట్లు వారు భావిస్తున్నారు.
ఇరుకైన రోడ్డు..
ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి బయల్దేరారు. అయితే రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఫైర్ ఇంజన్లు క్లబ్ సమీపానికి చేరుకోలేక పోయారు. సుమారు 400 మీటర్ల దూరంలో వాటిని ఆపాల్సి రావడంతో మంటలను అర్పిందుకు కాస్త ఆలస్యమైంది. ఇది కూడా చాలామంది మరణానికి ఒక కారణం. తాటి మట్టెలతో క్లబ్ నిర్మించడం.. మంటలు త్వరగా వ్యాప్తి చెందటానికి మరో కారణం.
నిబంధనల ఉల్లంఘన..
తమ నిబంధనలను నైట్ క్లబ్ యాజమాన్యం పాటించలేదని అగ్ని మాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత కలాంగూట్ ఎమ్మెల్యే మైఖేల్ లోబో అన్ని నైట్ క్లబ్‌లను తనిఖీ చేసి అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని క్లబ్‌ల లైసెన్స్ రద్దు చేయిస్తామని ఆయన హెచ్చరించారు.
క్లబ్ అక్రమ నిర్మాణం..
క్లబ్ నిర్మాణానికి అసలు పర్మిషన్ తీసుకోలేదని అర్పోరా-నాగోవా సర్పంచ్ రోషన్ రెడ్కర్ పేర్కొన్నారు. తమకు ఫిర్యాదు అందడంతో క్లబ్ కూల్చివేతకు నోటీసు జారీ చేశామని, అయితే క్లబ్ నిర్వాహకుడు సౌరభ్ లూత్రా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడని చెప్పారు.

