ఏనుగు దాడిలో చనిపోయిన కేరళ టివి జర్నలిస్టు
కేరళలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నది దాటుతున్న అడవి ఏనుగుల గుంపును వీడియో తీయబోయిన ఓ ఛానెల్ కెమెరామన్ పై ఏనుగుల గుంపు దాడి చేసింది...
కేరళలోని పాలక్కాడ్ లో ఓ ఛానెల్ కెమెరామెన్ మృతి చెందాడు. అడవి ఏనుగులను సంబంధించి ఓ ప్రోగ్రాం ను షూట్ చేయడానికి వేచి ఉండగా, ఏనుగుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో మలయాళంలోని మాతృభూమి ఛానెల్ కెమెరామెన్ ఏవీ ముఖేష్ తీవ్రంగా గాయపడ్డారు. తోటి సిబ్బంది తరువాత తేరుకుని ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.
కొట్టేక్కాడ్ లోని ఓ నదీని దాటుతున్న ఏనుగుల గుంపును వీడియో తీయడానికి యూనిట్ సిద్ధమవుతున్న తరుణంలో, ఒక్కసారిగా గుంపు యూనిట్ పైకి దాడి దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భయంలో తలోదిక్కుకు పారిపోగా.. ముఖేష్ పరిగెడుతున్న సమయంలో కిందపడిపోయి ఏనుగుల గుంపుకు దొరికి పోయాడు. ఏనుగుల గుంపు దాడిలో తీవ్రంగా గాయపడ్డ ముఖేష్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆయన పార్దీవ శరీరాన్ని పాలక్కాడ్ లోని ఆస్పత్రి మార్చురీ భద్రపరిచారు.
మలప్పురానికి చెందిన ముఖేష్ ఢిల్లీలో చాలాకాలం పనిచేశాడు. ముఖేష్ ఫోటోగ్రఫీతో పాటు మాతృభూమి. కామ్ లో అతిజీవనం పేరుతో కాలమ్స్ రాసేవారు. ఈ మధ్యనే కేరళకు తిరిగి వచ్చిన మాతృభూమి ఛానెల్ లో కెమెరామన్ గా చేరాడు. అతని పెళ్లి, విడాకులు అయ్యాయి.
లోక్ పైలెట్ పై కేసు నమోదు
ఇదే ప్రాంతంలో ఉన్న రైల్వే లైన్ దాటుతున్న ఓ ఏనుగుల గుంపు రైలు ఢీ కొట్టడంతో ఓ ఏనుగు మృతి చెందింది. అడవి ఏనుగులు తరుచూ ట్రాక్ దాటుతున్న కారణంగా ఇక్కడ రైలు వేగంపై పరిమితులు ఉన్నాయి. అయితే దానిని ఉల్లఘించినందుకు లోకో ఫైలెట్ పై కేసు నమోదు అయింది.
Next Story