‘ఆ దుర్ఘటనకు సీఎం యోగినే బాధ్యుడు’
x

‘ఆ దుర్ఘటనకు సీఎం యోగినే బాధ్యుడు’

హత్రాస్ దుర్ఘటన వెనక కుట్రం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేసిన సీఎం ఆదిత్యనాథ్‌కు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ ఎలా కౌంటర్ ఇచ్చారు?


హత్రాస్ తొక్కిసలాట వెనుక ఏ కుట్ర లేదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. పాలకులు తమకు చెడ్డపేరు రాకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

తొక్కిసలాట వెనక కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాన్ని సీఎం ఆదిత్యనాథ్ వ్యక్తం చేయడంతో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వెంటనే స్పందించి ఉంటే అనర్థం జరిగేది కాదు..

"ఘటన జరిగిన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. అంతమంది జనం రావడాన్ని మీడియాలో చూశారు. వెంటనే స్పందించి అవసరమైనంత పోలీసు సిబ్బంది పంపి ఉండాల్సింది. అలా చేయలేదు. దుర్ఘటనకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత.’’ అని అఖిలేష్ మీడియాతో అన్నారు. బాధితుల్లో చాలా మందికి సరైన చికిత్స అందక ప్రాణాలు కోల్పోయారని కూడా యాదవ్ ఆరోపించారు.

దుర్ఘటనలో 121 మంది మృతి..

భోలే బాబా సత్సంగంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించగా.. 28 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేసేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ న్యాయ విచారణకు ఆదేశించారు. ప్యానెల్ తన నివేదికను రెండు నెలల్లో సమర్పించనుంది.

అగ్గి రాజేసిన అఖిలేష్..

“ఆరోగ్య శాఖ మంత్రి పాఠక్‌కు ఆ శాఖపై శ్రద్ధ లేదు. ముఖ్యమంత్రి పదవి నుండి యోగిని తప్పించి ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఆ విషయం సీఎంకు కూడా తెలుసు. కాబట్టి సీఎం ఆరోగ్య శాఖకు ఎలాంటి బడ్జెట్ కేటాయించడం లేదు’’ అని ఇద్దరి మధ్య అగ్గి రాజేశారు అఖిలేష్.

ఉత్తరప్రదేశ్‌లో ఆరోగ్య సేవలు పూర్తిగా బాగోలేవన్న విషయాన్నితాను నిరంతరం గుర్తుచేస్తూనే ఉన్నానన్నారు. కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని చెప్పిన వాళ్లే .. తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలను నాశనం చేశారని యాదవ్ ఆరోపించారు.

బీజేపీ ప్రభుత్వం పేదల కోసం ఒక్క జిల్లా ఆసుపత్రిని కూడా నిర్మించలేదన్నారు. అత్యవసర వేళ ఎవరికీ సరైన వైద్యం అందడం లేదని కూడా విమర్శించారు.

సహరాన్‌పూర్‌లోని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) మాజీ ఎంపి హాజీ ఫజ్లూర్ రెహమాన్ బుధవారం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో చేసిన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అఖిలేష్ మీడియాతో మాట్లాడారు.

Read More
Next Story