
CEC జ్ఞానేష్ కుమార్
‘బలమైన ప్రజాస్వామ్యానికి పునాది SIR’
CEC జ్ఞానేష్ కుమార్..
బీహార్(Bihar) రాష్ర్టంలో ఓటరు జాబితా సవరణపై విపక్షాలు ఈసీ(CEC)పై దుమ్మెత్తిపోస్తున్నాయి. తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. SIR వల్ల కోట్లాది మంది ఓటు హక్కు కోల్పోతారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) నోరు విప్పారు. ‘‘బలమైన ప్రజాస్వామ్యానికి నిష్పాక్షిక ఎన్నికలు అవసరం. చనిపోయిన వ్యక్తులను, శాశ్వత వలసదారులను, రెండు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేసుకున్న ఓటర్లను వదిలేయమంటారా? అని ప్రశ్నించారు. ఒక్క బీహార్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా SIR అమల్లోకి వస్తుందని చెప్పారు.
బీహార్‌లో జరుగుతోన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో.. ఇప్పటివరకు 52 లక్షలకు పైగా ఓటర్లు తమ చిరునామాలలో లేరని, మరో 18 లక్షల మంది చనిపోయారని ఎన్నికల సిబ్బంది గుర్తించారు.
Next Story