హర్యానా మహిళలకు గుడ్‌న్యూస్..
x

హర్యానా మహిళలకు గుడ్‌న్యూస్..

తాము తిరిగి అధికారంలోకి వస్తే అర్హులైన మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోబోతుంది.


Click the Play button to hear this message in audio format

హర్యానా మంత్రి కృష్ణన్ కుమార్ బేడి (Krishan Kumar Bedi) శుభవార్త చెప్పారు. 'లడో లక్ష్మీ యోజన'(Lado Lakshmi Yojana) కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,100 ఆర్థిక సాయం అందజేసే అంశంపై తర్వలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పూజ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్థిక సాయం చేస్తామని 2024 అక్టోబర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ(BJP) హామీ ఇచ్చింది.

"మరి కాంగ్రెస్ హామీలెక్కడ?"

కాంగ్రెస్(Congress) సభ్యుల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో మంత్రి కృష్ణన్ కుమార్ బేడి.. "కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలవుతున్నాయో గుర్తుపెట్టుకోవాలి" అని ఎద్దేవ చేశారు. "హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ మహిళలకు కొన్ని హామీలు ఇచ్చింది. తెలంగాణ, కర్ణాటకలోనూ ఇచ్చింది. కానీ ఇప్పుడు వాటి గురించి వారు నోరు మెదపడం లేదు," అని బేడీ విమర్శించారు.


Read More
Next Story