అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..
x

అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..

జూలై 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 9తో ముగుస్తుంది.


Click the Play button to hear this message in audio format

పవిత్ర అమర్‌నాథ్ యాత్ర గురువారం నుంచి నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా యాత్రా మార్గాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా బుధవారం యాత్రకు వెళ్లే రెండు మార్గాల్లో ఒకటైన బాల్టాల్ రూట్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మహిళా యాత్రికురాలు చనిపోగా.. మరో ముగ్గురు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఏడాది జమ్మూ నుంచి అమర్‌నాథ్ యాత్రను నిలిపివేయబడటం ఇదే ప్రథమం.

ఆన్‌లైన్‌లో 4 లక్షల మంది దరఖాస్తు..

3,880 మీటర్ల ఎత్తులో ఉన్న మంచులింగాన్ని ఇప్పటివరకు 2.35 లక్షలకు పైగా యాత్రికులు దర్శించుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మొదటి బ్యాచ్ యాత్రకు జూలై 2న జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రకు ఇప్పటివరకు 4 లక్షలకు పైగా భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. గత సంవత్సరం 5.10 లక్షలకు యాత్రికులు స్వామిని దర్శించుకున్నారు. 38 రోజుల పాటు యాత్రికులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. జూలై 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 9తో ముగుస్తుంది.

Read More
Next Story