‘రోడ్లు బాగోలేకుంటే టోల్ వసూలు చేయొద్దు’
x

‘రోడ్లు బాగోలేకుంటే టోల్ వసూలు చేయొద్దు’

శాటిలైట్ ఆధారిత టోల్‌ ఛార్జీల వసూళ్లను ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించనున్నట్లు గడ్కరీ తెలిపారు. రోడ్లు అధ్వానంగా ఉంటే టోల్ చార్జీ వసూలు చేయరాదని పేర్కొన్నారు


టోల్‌ ఛార్జీల వసూళ్లపై కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లు అధ్వానంగా ఉంటే టోల్ చార్జీ వసూలు చేయరాదని పేర్కొన్నారు.గుంతలతో కూడిన రోడ్లు, టోల్‌ ప్లాజాల వద్ద రద్దీ.. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలుపై నిర్వహించిన గ్లోబల్‌ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.

‘‘మీరు నాణ్యమైన సేవలందిచలేనపుడు టోల్‌ ఛార్జీ వసూలు చేయొద్దు. రోడ్లు బాగా లేకపోతే ప్రజలు హర్షించారు. గుంతల పడ్డ రోడ్లపై టోల్‌ వసూలు చేస్తే జానాగ్రహానికి గురికావాల్సి వస్తుంది’’ అని గడ్కరీ అన్నారు.

శాటిలైట్‌ టోల్‌ ఛార్జీలు..

శాటిలైట్ ఆధారిత టోల్‌ ఛార్జీల వసూలు విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించనున్నట్లు గడ్కరీ తెలిపారు. తొలి దశలో 5 వేల కిలోమీటర్ల రహదారులపై ఈ టోల్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. తొలుత ప్రైవేట్, వాణిజ్య వాహనాలపై దీన్ని అమలు చేయాలని, టోల్‌ వసూలుకు కీలకమైన వెహికల్‌ ట్రాకర్‌ సిస్టమ్‌ యూనిట్‌ను ఆయా వాహనాల్లో అమర్చాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే వాహనాలు టోల్‌ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. దశలవారీగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి రూ.10వేల కోట్లు అదనపు ఆదాయం సమకూరనుందని గడ్కరీ తెలిపారు.

Read More
Next Story