జమ్ములో ఉగ్రవాదుల దాడిపై కాంగ్రెస్ ఎలా స్పందించింది?
x

జమ్ములో ఉగ్రవాదుల దాడిపై కాంగ్రెస్ ఎలా స్పందించింది?

జమ్మూకశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు చనిపోయారు.


జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు చనిపోయారు. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేతలు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీర జవాన్లకు, వారి కుటుంబాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం అని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో కేంద్రాన్నీ విమర్శించారు.

తీవ్ర మనోవేదనకు గురయ్యా..

ఒక అధికారి సహా నలుగురు వీర జవాన్లు వీరమరణం తనను తీవ్రంగా కలచివేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్సించారు. ఉగ్రవాదుల హింసాత్మక చర్యలకు ఖండించేందుకు మాటలు సరిపోవన్నారు. తమ పార్టీ సాయుధ దళాలకు అండగా నిలుస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం ప్రతీదీ వ్యాపారంగానే చూస్తుందని, ఇటీవల జరుగుతున్న దాడులను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.

78 రోజుల్లో 11 ఉగ్రదాడులు..

జమ్ములో తరుచుగా ఉగ్రదాడులు జరుగుతుండడం బాధాకరమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. గడిచిన 78 రోజుల్లో 11 ఉగ్రదాడులు జరిగాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. స్వయం ప్రకటిత చాణిక్య చెప్పుకునే ప్రధాని దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

అత్యంత బాధాకారం..

జమ్మూకశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందడం బాధాకరమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. వీర జవాన్లకు, వారి కుటుంబాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం అని పేర్కొన్నారు.

తీవ్రవాదుల దాడులు పెరిగాయి...

కాంగ్రెస్ మీడియా ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా కూడా తాజా దాడిపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశం సమాధానాలు కోరుకుంటుందని అన్నారు.

"దేశాన్ని కేవలం నినాదాలతో నడపలేదు" అని ఖేరా హిందీలో ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. గత మూడు వారాల్లో దోడా జిల్లా అడవుల్లో.. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన మూడో అతిపెద్ద ఎన్‌కౌంటర్ ఇది అని ఆయన పేర్కొన్నారు. 2005 నుంచి 2021 వరకు ప్రశాంతంగా ఉన్న జమ్ము ప్రాంతంలో గత నెల రోజుల నుంచి మళ్లీ తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. యాత్రికుల బస్సుపై దాడి చేసిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా. 40 మంది గాయపడ్డారని ఆయన గుర్తుచేశారు.

Read More
Next Story