పాక్‌కు 1 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి..
x

పాక్‌కు 1 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి..

భారత విన్నపాన్ని పట్టించుకోని ప్రపంచ బ్యాంకు..


Click the Play button to hear this message in audio format

పాకిస్తాన్‌(Pakistan)కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఆర్థిక సాయం ప్రకటించింది. ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద 1 బిలియన్ డాలర్ల తక్షణ చెల్లింపునకు ఆమోదించింది. వాషింగ్టన్‌లో జరిగిన IMF బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వాగతించారు.

కాగా IMF నిర్ణయంపై భారత్ మండిపడింది. పాకిస్థాన్.. ఆ సాయాన్ని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ముందు లేవనెత్తింది కూడా. ఆ నిధులను పాక్‌ సక్రమంగా వినియోగించి ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేదని చెప్పుకొచ్చింది భారత్.

అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి పాక్‌ గత35 ఏళ్లలో 28 సార్లు రుణాలు తీసుకుందని, ఐఎంఎఫ్‌ షరతులకు ఎప్పుడు కట్టుబడి లేదని భారత్‌ ధ్వజమెత్తింది. గతంలో తీసుకున్న అప్పులను కూడా పాక్‌ సక్రమంగా వినియోగించలేదని ఆరోపించింది.

ఇటు పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఇదే విషయంపై ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘మేం 7 బిలియన్ యూఎస్ డాలర్లు రుణం అడగ్గా IMF 1 బిలియన్ యూఎస్ డాలర్లు అప్పు ఇచ్చింది’’ అని పేర్కొంది.

ఏప్రిల్ 22న 26 మంది పర్యాటకుల ప్రాణాలను ఉగ్రమూకలు పొట్టన పెట్టుకున్న విషయం తెలిసింది. ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) పేరిట భారత రక్షణ దళాలు చేపట్టిన ప్రతిదాడిలో పాకిస్తాన్, పాక్ అక్రమిత కశ్మీర్‌లో వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

Read More
Next Story