‘ఎక్స్ గ్రేషియాలో భార్య, తల్లిదండ్రులకు సమాన వాట’
x
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్

‘ఎక్స్ గ్రేషియాలో భార్య, తల్లిదండ్రులకు సమాన వాట’

కెప్టెన్ అన్షుమాన్ సింగ్ ఘటనతో మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎక్స్ గ్రేషియాలో సమాన వాటా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.


మధ్యప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. విధి నిర్వహణలో పోలీసు జవాన్ మరణిస్తే..ప్రభుత్వం ఇచ్చే రూ. కోటి ఎక్స్‌గ్రేషియాను మృతుడి భార్య, తల్లిదండ్రులకు సమానంగా పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు.

"ఒక రాష్ట్ర పోలీసు జవాన్ అమరుడైతే.. చెల్లించాల్సిన రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియాను అతని భార్య, తల్లిదండ్రుల మధ్య 50:50 నిష్పత్తిలో పంచుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాము" అని ప్రభుత్వ అధికారి ఒకరు యాదవ్‌ను ఉటంకిస్తూ తెలిపారు.

కెప్టెన్ అన్హుమాన్ సింగ్ ఘటనతో..

సియాచిన్ హిమానీనదంలోని భారత ఆర్మీ క్యాంపులో గతేడాది జూలైలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం నుంచి ప్రజలను కాపాడే క్రమంలో కెప్టెన్ అన్షుమాన్ సింగ్ మరణించారు. ఈ నెల ప్రారంభంలో భారతదేశ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్రను ఆయనకు ప్రదానం చేశారు.

ఆర్మీ నిబంధనల ప్రకారం.. పెళ్లయి విధి నిర్వహణలో ఒక జవాన్ లేదా అధికారి మరణిస్తే.. మృతుడి భార్యకే నష్టపరిహారం దక్కుతుంది. తల్లిదండ్రులకు ఆ డబ్బుపై ఎలాంటి హక్కు ఉండదు.

భర్త మరణానంతరం ప్రభుత్వం ఎక్స్ గ్రేషియాగా అందజేసిన డబ్బుతో తమ కోడలు ఇంటిని విడిచి వెళ్లడంతో తమ జీవనం దుర్భరంగా మారిందని కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు నిబంధనలు మార్చాలని వారు బీజేపీ అగ్రనేతలను కోరారు. సింగ్ ఘటనతో మధ్య ప్రదేశం ప్రభుత్వం నిబంధనలను మార్చింది. ఎక్స్ గ్రేషియాలో భార్య, తల్లిదండ్రులకు సమాన వాట కల్పిస్తోంది.

Read More
Next Story