నిమిషా ప్రియకు ఉరిశిక్ష వాయిదా ?

మృతుడి కుటుంబానికి 1 మిలియన్ డాలర్ల బ్లడ్ మనీ సిద్ధం..


Click the Play button to hear this message in audio format

ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. కేరళ(Kerala) నర్సు నిమిషా ప్రియ(Nimisha Priya)కు ఉరిశిక్ష వాయిదా పడింది. వాస్తవానికి యెమన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీ హత్య కేసులో ఇప్పటికే కరాగారంలో ఉన్న నిమిషాను రేపు(జూలై 16న) ఉరిశిక్ష విధించాల్సి ఉంది.



అయితే భారతదేశ గ్రాండ్ ముఫ్తీ, కేరళకు చెందిన సున్నీ నాయకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ జోక్యం ఫలించినట్లుంది. మృతుడి కుటుంబంతో చర్చలు ముగిసే వరకు ఉరిశిక్ష నిలిపివేయాలన్న ఆయన విజ్ఞప్తిని యెమెన్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ముస్లియార్‌ తన స్నేహితుడు ప్రఖ్యాత యెమెన్ పండితుడు అయిన షేక్ హబీబ్ ఉమర్ సాయంతో మృతుడి కుటుంబసభ్యులతో మధ్యవర్తిత్వం వహించారు. నిమిషా కుటుంబం 1 మిలియన్ డాలర్ల బ్లడ్ మనీని హతుడి కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే నిమిషా మరణశిక్ష వాయిదాకు సంబంధించి యెమెన్(Yemen) ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటించలేదు.


అసలు నిమిషా ప్రియకు మరణశిక్ష ఎందుకు విధించారు? ఎందుకు ఆమె యెమన్‌కు వెళ్లింది? తెలుసుకునేందుకు ఈ లింకు క్లిక్ చేయండి..నిమిషా ప్రియ చేసిన నేరమేంటి?

Read More
Next Story