వందేళ్లకు పైగా ఓటమి ఎరుగని సీటు.. కైవసం చేసుకున్న ఇండియన్..
x

వందేళ్లకు పైగా ఓటమి ఎరుగని సీటు.. కైవసం చేసుకున్న ఇండియన్..

యూకే సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ లకు లేబర్ పార్టీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఆ పార్టీకి వంద సంవత్సరాలు కు పైగా అప్రహాతిత అధికారం కట్టబెట్టిన..


యూకేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ 14 సంవత్సరాల తరువాత అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో కొన్ని స్థానాలు కన్జర్వేటివ్ లకు వంద సంవత్సరాల నుంచి వరుసగా గెలుస్తున్న స్థానాలను కోల్పోయింది. అలాంటి ఒక స్థానంలో లేబర్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఒక ఇండియన్ ఈ సారి గెలుపొందాడు.

కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన 49 ఏళ్ల సోజన్ జోసెఫ్ 139 సంవత్సరాల క్రితం ఏర్పడిన యాష్ ఫోర్డ్ నుంచి గెలుపొందారు. ఇక్కడ ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఎన్నికల్లో కన్జర్వేటివ్ లే గెలిచారు. లేబర్ పార్టీ ఒక్కసారి కూడా గెలుపొందలేదు. దీంతో ఈ పార్టీ తరఫున తొలిసారిగా గెలిచిన వ్యక్తిగా జోసెఫ్ రికార్డు సృష్టించాడు. లేబర్ పార్టీ గెలిచిన 410 మంది శాసనసభ్యులలో సోజన్ కూడా ఉన్నాడు. ఆయన 2001 లో యూకే కు వలస వచ్చారు.
కెంట్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ మెంటల్ హెల్త్ నర్సు అయిన సోజన్, టోరీలకు(కన్జర్వేటివ్ పార్టీ) సురక్షితమని భావించిన సీటులో మాజీ ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు డామియన్ గ్రీన్‌ను 1,779 ఓట్లతో ఓడించారు. గ్రీన్ యాష్‌ఫోర్డ్‌కు 27 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి మలయాళీగా సోజన్ అవతరించారు. ఆయన గెలుపుతో కొట్టాయంలోని కైపుజాలోని ఇంటిలో స్నేహితులు సంబరాలు జరుపుకున్నారు. సోజన్ భార్య బ్రైతా కూడా నర్సు, ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు.
“మేమంతా ఎంత సంతోషంగా ఉన్నామో మాటల్లో వర్ణించలేను. రాత్రంతా నిద్రపోలేదు. ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఇంత పెద్ద ఎన్నికల్లో ఆయన గెలుపొందడం మనందరికీ గర్వకారణం” అని వరి, రబ్బరు, టపియోకా పండించే అతని తండ్రి జోసెఫ్ అన్నారు.
తన కొడుకు ఎదుగుతున్న సమయంలో రాజకీయంగా పెద్దగా యాక్టివ్‌గా లేడని వెల్లడించారు. “అతను ఎక్కువగా చదువులతో బిజీగా ఉండేవాడు. కానీ ఆయనకు సోషలిస్టు భావజాలం అంటే మొగ్గు ఉండేది. బహుశా అదే అతన్ని లేబర్ పార్టీ వైపు ఆకర్షించింది. అతను అక్కడ చాలా యాక్టివ్‌గా మారాడు, మారథాన్‌లలో పాల్గొన్నాడు. సామాజిక ప్రయోజనాల కోసం బోట్ రేసులలో పాల్గొన్నాడు, ”అని అతను చెప్పాడు.
సోజన్ 2001లో UKకి వెళ్లడానికి ముందు బెంగళూరులోని డాక్టర్ BR అంబేద్కర్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ (సైకియాట్రీ)లో గ్రాడ్యుయేషన్ చేశాడు. 2021లో స్థానిక కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యాడు. రెండేళ్ల తర్వాత, మళ్లీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు.
శుక్రవారం తన విజయం తర్వాత, సోజన్ కెంట్ ఆన్‌లైన్‌తో మాట్లాడుతూ, “ఈ రాత్రి ఒక చారిత్రాత్మక క్షణం. టౌన్ సెంటర్, రోడ్లను మెరుగుపరచడం, చిన్న వ్యాపారాలకు సాయం చేయడం నేను యాష్‌ఫోర్డ్ కోసం చేయాలనుకుంటున్న కొన్ని విషయాలు అని వివరించారు.
Read More
Next Story