పశ్చిమ బెంగాల్‌లో వార్‌రూంల ఏర్పాటులో టీఎంసీ బిబీబిజీ..
x

పశ్చిమ బెంగాల్‌లో వార్‌రూంల ఏర్పాటులో టీఎంసీ బిబీబిజీ..

నవంబర్ 4 నుంచి మొదలు కానున్న S.I.R..


Click the Play button to hear this message in audio format

కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (S.I.R ) ప్రక్రియకు సిద్ధమవుతుంది. ఈ మేరకు బూత్ లెవర్ అధికారులకు మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ట్రైనింగ్ నవంబర్ 1 మొదలై 3వ తేదీతో ముగుస్తుంది. EC నియమించిన బూత్ లెవల్ అధికారులు (BLOలు) నవంబర్ 4న S.I.R ప్రక్రియ మొదలుపెడతారు.


వార్‌రూంల బాధ్యత ఎమ్మెల్యేలకు..

మరోవైపు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) వార్ రూంల ఏర్పాటులో బిజీ అయ్యింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 294 వార్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ యూనిట్లను స్థానిక ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తారు. టీఎంసీ శాసనసభ్యులు లేని నియోజకవర్గాలలో బ్లాక్ అధ్యక్షులు ఆ బాధ్యతలు స్వీకరిస్తారు.

తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి నుంచి దాదాపు 18వేల మంది నాయకులు పాల్గొన్నారు. వారికి ఆయన దిశానిర్దేశం చేశారు.

‘‘ప్రతి వార్‌రూమ్‌లో 15 మంది సభ్యులు ఉంటారని, వీరిలో పది మంది బూత్-స్థాయి ఏజెంట్లతో (BLA-2లు) నేరుగా ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటారు. డేటా ఎంట్రీ, రికార్డ్ కీపింగ్ కోసం మరో ఐదుగురు శిక్షణ పొందిన సిబ్బంది ఉంటారు’’ అని TMC నాయకుడొకరు ది ఫెడరల్‌కు చెప్పారు. ‘‘ ప్రతి వార్‌రూంలో ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ కనెక్షన్, కనీసం ఐదుగురు "కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న యువకులు ఉంటారు. S.I.R పూర్తయ్యేవరకు ప్రతి BLO వెంట పార్టీ సొంత BLA-2 ఉండాలని బెనర్జీ ఆదేశించారు. వీరు బీఎల్‌లోలకు సహాయకారిగా ఉంటూనే ఓటరు వివరాల సేకరణలో అప్రమత్తంగా ఉంటారు.’’ అని వివరించారు.


గ్రామీణ ప్రాంతాల్లోనూ..

ఇక గ్రామీణ ప్రాంతాల్లో బీఎల్‌వోలతో సమన్వయం కోసం బ్లాక్ ఎలక్టోరల్ రోల్ సూపర్‌వైజర్ (BERS), పంచాయతీ ఎలక్టోరల్ రోల్ సూపర్‌వైజర్ (PERS) అనే పోస్టులు సృష్టించారు కొంతమందికి ఆ బాధ్యతలు అప్పగించారు. మునిసిపాలిటీల్లో అయితే ప్రతి వార్డుకు ఒక వ్యక్తి ఇలాంటి విధులను నిర్వహించేలా టీఎంసీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది.


పార్టీ నాయకులకు అభిషేక్ సూచన..

"రాబోయే ఆరు నెలలు మనకు చాలా కీలకం. ఏ నిజమైన ఓటరు పేరును బీజేపీ లేదా ఎలక్షన్ కమిషన్ తొలగించకుండా మనం చూసుకోవాలి. పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి నియోజకవర్గంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సహాయ శిబిరాలు తెరిచి ఉంచాలి. పార్టీ వలంటీర్లు ఫారాలను పూర్తి చేయడంలో సాయపడాలి. ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులను తిరిగి తీసుకురావాలి.

మైనారిటీలు ఎక్కువగా నివసించే మాల్డా, ముర్షిదాబాద్ జిల్లాల నాయకులు వలస కార్మికుల పేర్లు జాబితాలో ఉండేలా చూసుకోవాలి. జల్పైగురి, అలీపుర్దువార్‌లో పార్టీ కార్యకర్తలు ప్రతి లేబర్ కాలనీని సందర్శించాలి.

Read More
Next Story