బీహార్ ఎన్నికలు: 44 మంది అభ్యర్థులతో జేడీ(యూ) రెండో జాబితా..
x

బీహార్ ఎన్నికలు: 44 మంది అభ్యర్థులతో జేడీ(యూ) రెండో జాబితా..

మొత్తం 101 మందిలో 37 మంది OBC, 22 మంది EBC, 22 మంది జనరల్ కేటగిరీ, 15 మంది SC అభ్యర్థులు, ఒకరు ST, నలుగురు ముస్లిం అభ్యర్థులకు టికెట్లిచ్చిన జేడీ(యూ)..


Click the Play button to hear this message in audio format

బీహార్(Bihar) ముఖ్యమంత్రి నితీష్ కుమార్(CM Nitish Kumar) నేతృత్వంలోని JD(U) గురువారం (అక్టోబర్ 16) తమ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. 44 మంది పేర్లను ప్రకటించింది. ఇందులో షీలా మండల్, విజేంద్ర ప్రసాద్ యాదవ్, లేషి సింగ్, జయంత్ రాజ్, మొహమ్మద్ జామా ఖాన్ లాంటి పలువురు మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి.

నబీనగర్ నుంచి చేతన్ ఆనంద్, నవాడ్ నుంచి విభా దేవిని పోటీకి దింపింది. వీరిద్దరికి గతంలో RJDతో సంబంధాలున్నాయి. ఇక రూపౌలి స్థానం నుంచి కళాధర్ మండల్‌కు టికెట్ దక్కింది.

బుధవారం జేడీ(యూ) తొలి జాబితాలో 57 మంది అభ్యర్థులను విడుదల చేసిన విషయం తెలిసింది. సోన్‌బార్సా, మోర్వా, ఎక్మా, రాజ్‌గిర్ స్థానాల్లో జేడీ(యూ)కు మంచి పట్టుంది. అయితే సీట్ల సర్దుబాటలో భాగంగా ఈ స్థానాలు చిరాగ్ పాశ్వాన్‌(రామ్ విలాస్) కోరడంపై నితీష్ గుర్రుగా ఉన్నారు.


కుల సమీకరణాల ప్రకారంగా..

కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని జేడీ(యూ) అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. ఈ లెక్కన 101 మందిలో 37 మంది OBC అభ్యర్థులు, 22 మంది EBC, 22 మంది జనరల్ కేటగిరీ, 15 మంది SC అభ్యర్థులు, 1 ST అభ్యర్థి, నలుగురు ముస్లిం అభ్యర్థులకు జేడీ(యూ) టిక్కెట్లు దక్కాయి.

మొత్తం 243 స్థానాలకు గాను BJP, JD(U) 101 సీట్ల చొప్పున పంచుకున్నాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి 29 సీట్లు కేటాయించారు. ఇక రాష్ట్రీయ లోక్ మోర్చా(RLM), హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM)కు ఆరు సీట్ల చొప్పున ఇచ్చారు. ఎన్నికలు(Assembly Elections) రెండు దశల్లో (నవంబర్ 6, 11 తేదీల్లో) జరుగుతాయి. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Read More
Next Story