జార్ఖండ్ లో జేఎంఎం కూటమి హవా.. గ్రేట్ విక్టరీ దిశగా పరుగులు
x

జార్ఖండ్ లో జేఎంఎం కూటమి హవా.. గ్రేట్ విక్టరీ దిశగా పరుగులు

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి స్టన్నింగ్ విక్టరీ దిశగా పరుగులు తీస్తోంది. అయితే చాలా చోట్ల ఆ పార్టీ సాధించిన ఆధిక్యం కేవలం రెండు వేల లోపే ఉంది.


మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాలల్లో పాత కాపులే తిరిగి అధికారం దక్కించుకున్నారు. ముఖ్యంగా అడవుల రాష్ట్రం జార్ఖండ్ లో జేఎంఎం నేతృత్వంలోని ఇండి కూటమి జయకేతనం ఎగరవేసింది. తాజాగా అందుతున్న ఫలితాల ప్రకారం 81 స్థానాలున్న అసెంబ్లీ మెజారిటీ మార్క్ అయిన అవసరం అయిన 41 సీట్లను ఇండి కూటమి సాధించింది.

మేజిక్ ఫిగర్ కు అవసరం అయిన సంఖ్యను సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కేవలం 29 స్థానాలకే పరిమితమైంది. జేకేఎల్ఎం ఒక్కస్థానంలో, ఒక స్థానంలో స్వతంత్ర్య అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకూ 73 స్థానాలు ఫలితాలు వెలువడ్డాయి.

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి రెండు కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. గంటగంటకు ఆధిక్యం చేతులు మారుతూ వస్తోంది. కొన్నిసార్లు ఎన్డీఏ కూటమి 41 సీట్ల మార్క్ ను అందుకుంది. కానీ కమలదళం మేజిక్ ఫిగర్ ను నిలబెట్టుకోలేకపోయింది. కాసేపటికే ఇండి కూటమి మేజిక్ మార్క్ ను చేరుకుని చివరి వరకూ నిలబడింది.
హేమంత్ సోరెన్..
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పోటీ చేస్తున్న బర్హైత్ అసెంబ్లీ స్థానంలో తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి 2,812 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్డీయే మిత్రపక్షం ఏజేఎస్‌యూ పార్టీ అధినేత సుదేశ్ మహ్తో రెండో రౌండ్ కౌంటింగ్ తర్వాత సిల్లీలో జేఎంఎంకు చెందిన అమిత్ కుమార్‌పై 3,998 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు.
జగన్నాథ్‌పూర్‌లో మాజీ ఎంపీ, బీజేపీ అభ్యర్థి గీతా కోరా కాంగ్రెస్‌కు చెందిన సోనారామ్ సింకు కంటే 1,790 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఖుంటిలో జేఎంఎంకు చెందిన రాంసూర్య ముండా బీజేపీకి చెందిన నీలకంత్ సింగ్ ముండాపై 1,448 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
సెరైకెలాలో జేఎంఎంకు చెందిన గణేష్ మహలీపై మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి చంపై సోరెన్ 2,986 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. బెర్మోలో కాంగ్రెస్‌కు చెందిన కుమార్ జైమంగల్ సింగ్ తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన రవీంద్ర పాండేపై 3,610 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
రెండో రౌండ్ కౌంటింగ్ తర్వాత ఏజేఎస్‌యూ పార్టీకి చెందిన నిరు శాంతి భగత్‌పై కాంగ్రెస్ మంత్రి రామేశ్వర్ ఓరాన్ 1,841 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కొలెబిరాలో కాంగ్రెస్ అభ్యర్థి నమన్ బిక్సల్ కొంగరి ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. సిండెగాలో బీజేపీ అభ్యర్థి శ్రద్ధానంద్ బెస్రా ఆధిక్యంలో ఉన్నారు. గర్వాలో బీజేపీకి చెందిన సత్యేంద్ర నాథ్ తివారీ తన ప్రత్యర్థి జేఎంఎంకు చెందిన మిథిలేష్ కుమార్ థార్కూర్‌పై 190 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కోడెర్మాలో ఆర్జేడీకి చెందిన సుభాష్ యాదవ్ బీజేపీ అభ్యర్థి నీరా యాదవ్‌పై 1,481 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. చత్రా నుంచి ఆర్జేడీ అభ్యర్థి రష్మీ ప్రకాశ్ 988 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
1,211 మంది అభ్యర్థులు బరిలో..
బర్హైత్ నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గాండే నుంచి ఆయన భార్య కల్పన, ధన్వర్ నుంచి మాజీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ, సెరైకెలా నుంచి మాజీ సీఎం చంపాయ్ సోరెన్ సహా మొత్తం 1,211 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని ఈ ఫలితాలు నిర్ణయిస్తాయి.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ కొనసాగుతోందని, సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని ప్రధాన ఎన్నికల అధికారి కె.రవికుమార్ తెలిపారు. టోర్సా అసెంబ్లీ లో కేవలం 13 రౌండ్లు మాత్రమే కావడంతో త్వరగా ఫలితం వెలువడింది.
ఛత్ర స్థానానికి అత్యధికంగా 24 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. నవంబర్ 15, 2000న జార్ఖండ్ ఏర్పడిన తర్వాత అత్యధికంగా ఈసారి 67.74 శాతం ఓటింగ్ నమోదైంది. నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.


Read More
Next Story