
తుదిశ్వాస విడిచిన ప్రముఖ జర్నలిస్ట్ మార్క్ టుల్లీ
భారతదేశంపై టుల్లీ 'నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా', 'ఇండియా ఇన్ స్లో మోషన్', 'ది హార్ట్ ఆఫ్ ఇండియా' రచనలకు మంచి గుర్తింపు..
ప్రముఖ జర్నలిస్ట్ మార్క్ టుల్లీ(Mark Tully) తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం క్రితం ఆయనను కుటుంబసభ్యులు ఢిల్లీ సాకేత్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఆదివారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుడు సతీష్ జాకబ్ తెలిపారు. 1935 అక్టోబర్ 24న కలకత్తాలో (ఇప్పుడు కోల్‌కతా) జన్మించిన టల్లీ.. న్యూఢిల్లీలోని BBCకి 22 సంవత్సరాల పాటు చీఫ్ ఆఫ్ బ్యూరోగా పనిచేశారు. BBC రేడియో 4 కార్యక్రమంలో 'సమ్‌థింగ్ అండర్‌స్టూడ్' అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. 2005లో భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ అందుకున్నారు. భారతదేశంపై టల్లీ 'నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా', 'ఇండియా ఇన్ స్లో మోషన్', 'ది హార్ట్ ఆఫ్ ఇండియా' వంటి అనేక పుస్తకాలు రాశారు.
Next Story

