‘ఆలయాల నిధులను విద్యా సంస్థలకు కేటాయించడం కొత్తేమీ కాదు..’
x

‘ఆలయాల నిధులను విద్యా సంస్థలకు కేటాయించడం కొత్తేమీ కాదు..’

ది ఫెడరల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఎంకే ఎంపీ కనిమొళి..


Click the Play button to hear this message in audio format

తమిళనాడు(Tamil Nadu)లో అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎంకే స్టాలిక్ సర్కారు విద్యాసంస్థల నిర్మాణానికి ఆలయ నిధులను వినియోగించడంపై రాజకీయ దుమారం రేగింది. దేవాలయాల్లో భక్తులు సమర్పించే కానుకలను దుర్వినియోగం చేస్తున్నారని ఏఐఏడీఎంకే (AIADMK) నేత ఇ. ఫళని స్వామి(Palaniswami) ఆరోపించారు. విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం సొంత నిధులను కేటాయించలేదా? అని ప్రశ్నించారు. ఫళని స్వామి ప్రశ్నలకు డీఎంకే (DMK) ఎంపీ కనిమొళి కౌంటర్ ఇచ్చారు. ఆలయాలకు వచ్చే డబ్బుతో విద్యాసంస్థలు ఏర్పాటుచేయడం రాష్ట్రంలో చాలా కాలంగా వస్తున్న సంప్రదాయమని సమాధానమిచ్చారు. కొత్తగా ఎంకె స్టాలిన్ ప్రభుత్వం ప్రారంభించినది కాదని పేర్కొన్నారు.

‘‘స్వాతంత్య్రానికి ముందు క్రైస్తవ మిషనరీలు కళాశాలలు, పాఠశాలలను ప్రారంభించాయని, ఇస్లామిక్ సంస్థలు సొంత పాఠశాలలను ఏర్పాటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత, అంతకు ముందు MG రామచంద్రన్ హయాంలో కూడా దేవాలయాల నిధులను విద్యాసంస్థలకు ఖర్చుచేశారు. ద్రవిడ ఉద్యమం నుంచి వచ్చానని చెప్పుకునే వ్యక్తి RSS కంటే దారుణంగా మాట్లాడతాడని ఊహించలేదు.’’ అని ఫళనిస్వామి నుద్దేశించి అన్నారు DMK డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనిమొళి.

? తన పార్టీ అన్నాడీఎంకే లేదా డీఎంకే‌లాగా బీజేపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని టీవీకే చీఫ్ విజయ్ అన్నారు. దానిపై మీరు ఎలా స్పందిస్తారు?

BJP తో పొత్తు పెట్టుకోకూడదని ఆ పార్టీ నాయకుడు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. దాని గురించి నేను ఇంకేమీ చెప్పలేను. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది.. దాని భావజాలాన్ని సవాలు చేస్తున్నది డీఎంకే ఒక్కటే.

? ఆపరేషన్ సిందూర్‌‌లో భాగంగా మీ అంతర్జాతీయ పర్యటన విశేషాలు చెప్పగలరా? స్పెయిన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో భారతదేశ భాష 'భిన్నత్వంలో ఏకత్వం' అని అన్నారు. అంతర్జాతీయ పర్యటనా అనుభవం ఎలా ఉంది?

ఆ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. ఇతర దేశాలకు ఇండియా పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోడానికి పర్యటన దోహదపడింది. భారత్‌లో ఏం జరుగుతుందో చెప్పడానికి మాకు అవకాశం లభించింది. ఉగ్రవాదం, ఉగ్రవాదుల వల్ల నష్టాలేంటో హైలైట్ చేశాం.

? ఆపరేషన్ సిందూర్‌ను మీరు ఎలా చూస్తారు? ప్రభుత్వం ఊహించిన విధంగా స్పందించిందా..

ఆపరేషన్ సిందూర్‌పై మాకు కొన్ని అనుమానాలున్నాయి. వాటిపై పార్లమెంట్‌లో వివరణ కోరుతాం.

? ఆపరేషన్ సిందూర్‌ గురించి మీకు ఇంకా చాలా సందేహాలున్నట్టున్నాయి..

అవును, అందరికీ చాలా ప్రశ్నలు, సందేహాలున్నాయి. వాటి గురించి పార్లమెంట్ వేదికగా అడిగి తెలుసుకుంటాం.

మహారాష్ట్రలో ప్రాథమిక పాఠశాలల్లో హిందీ భాషను తప్పనిసరి చేసే అంశంపై అక్కడ రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తాయి. అయితే తమిళనాడు వంటి రాష్ట్రాలు చాలా కాలంగా హిందీ భాషను వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తారు?

హిందీ భాషను బలవంతంగా రుద్దడం వల్ల రాష్ట్ర గుర్తింపు దెబ్బతింటుందని తమిళనాడు చాలా ముందుగానే గ్రహించింది. అందుకే మన నాయకులు ముందునుంచే ఎదురుదాడి చేశారు. కొంచెం ఆలస్యం అయినా.. మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు హిందీ వల్ల వారి భాషలు వెనుకబడిపోతాయన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు.

? కేంద్రం తమిళనాడుకు వేల కోట్ల విద్యా నిధులను నిలిపివేసిందన్న ఆరోపణపై మీ స్పందన..ప్రధాని మోదీని మీరేం కోరుతారు..

తమ విద్యార్థులకు ఏం కావాలో రాష్ట్రాలకు బాగా తెలుసు. కేంద్రం కంటే బాగా నిర్వహించగలవు. పాఠశాలల నిర్వహణ రాష్ట్రాల పరిధిలో ఉంచడమే మంచిది.

? విద్యా విధానం, NEP‌కి సంబంధించిన అంశాలను మీరు మళ్ళీ పార్లమెంటులో లేవనెత్తుతారా..

ఈ సమస్యలపై పార్లమెంట్‌లో పదే పదే ప్రశ్నిస్తాం. వాటిని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంచాలన్నదే మా డిమాండ్.

Read More
Next Story