జమ్ము కాశ్మీర్ ఎన్నికల పోటీలో కాశ్మీరీ పండిట్ మహిళ
x
డైసీ రైనా

జమ్ము కాశ్మీర్ ఎన్నికల పోటీలో కాశ్మీరీ పండిట్ మహిళ

చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా కాశ్మీరీ పండిట్ మహిళ జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు.


చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా కాశ్మీరీ పండిట్ మహిళ జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. తీవ్రవాదం కారణంగా చాలా మంది కాశ్మీరీ పండిట్‌లు జమ్మూ , కాశ్మీర్‌ను వీడారు. ఉన్నవారిలో రాజకీయాల్లోకి రావాలనుకునే వారు చాలా అరుదు. డైసీ రైనా మాత్రం ధైర్యంగా పోటీకి సిద్ధం కావడం గమనార్హం.

రైనా పుల్వామాలోని ఫ్రిసాల్ గ్రామ సర్పంచ్. అంతకుముందు ఢిల్లీలోని ప్రైవేట్ సెక్టార్ మాజీ ఉద్యోగి. ప్రసుత్తం పుల్వామాలోని రాజ్‌పోరా నియోజకవర్గం నుంచి BJP మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) తరపున పోటీ చేస్తున్నారు.

రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఎలా కలిగిందన్న దానికి.. ‘సర్పంచ్‌గా పని చేస్తూ నిత్యం యువత సమస్యలను, కష్టాలను తెలుసుకునే దాణ్ని. జమ్మూ కాశ్మీర్‌లోని యువత, ముఖ్యంగా 1990లలో జన్మించిన వారు పలు హింసాత్మక ఘటనలను చూడాల్సి వచ్చిందని చెప్పారు.

ఇటీవల న్యాయవాది రాందాస్ అథవాలే రాష్ట్రాన్ని చక్కదిద్దాలని చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని పోటీ చేసేందుకు ప్రభావితం చేశాయా? అని అడిగిన ప్రశ్నకు..అలాంటిదేమీ లేదన్నారు.తనకు ఎప్పటి నుంచో పోటీ చేయాలన్న ఆలోచన ఉందని చెప్పారు.

రైనా ముస్లింల కోసం వాజుఖానా (అబ్లూషన్ చెరువు) నిర్మించారు. వారి అభ్యర్థన మేరకు పుల్వామాలో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా కొన్ని అభివృద్ధి పనులు చేయించారు. తాను వేరే వర్గానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ, తనకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని, ఎలాంటి భద్రత లేకుండా పుల్వామాలో స్వేచ్ఛగా తిరగగలుగుతున్నానని చెప్పారు. వ్యక్తిగత భద్రతా అధికారుల అవసరం కూడా లేదన్నారు.

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1 వరకు 90 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8 న కౌంటింగ్ ఉంటుంది.

పుల్వామా ప్రాంతానికి చెందిన కాశ్మీరీ పండిట్ మహిళ డైసీ రైనా జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Read More
Next Story