కేజ్రీవాల్ తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు: సుప్రీంకోర్టు
x

కేజ్రీవాల్ తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు: సుప్రీంకోర్టు

ఢిల్లీ సీఎం తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.


ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి, జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ తరచూ నేరాలు చేసే వాడు కాదని వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల దృష్ట్యా తన పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఆప్ నాయకుడికి మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఇంతకుమందే న్యాయస్థానం వెల్లడించింది. వాస్తవానికి కేజ్రీవాల్ తన అరెస్టుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతోంది. అయితే దానిపై విచారణ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది.

ఏడు లోక్‌సభ స్థానాలున్న ఢిల్లీలో మే 25న ఒకే దశలో ఓటింగ్ జరుగుతుంది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇది "అసాధారణ పరిస్థితి" అని. అతను సాధారణ నేరస్థుడు కాదని పేర్కొంది.
"ఆయన ఢిల్లీ సీఎం, ఎన్నికైన నాయకుడు. ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది అసాధారణ పరిస్థితి. ఇది ఒక రకమైన సాధారణ నేరస్థుడిలా కాదు. ఆయనను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలా వద్దా అనే దానిపై మేము వాదనలు విన్నాక నిర్ణయిస్తాం. " అని కోర్టు చెప్పింది. అతను ఢిల్లీ సిట్టింగ్ సిఎం మరియు లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
అధికారిక విధులు నిర్వర్తించడానికి కాదు
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరైతే అధికారికంగా విధులు నిర్వర్తించడం తమకు ఇష్టం లేదని సీఎం తరఫు హాజరై వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్నికల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే మీరు సీఎంఓ ఆఫీసుకు వెళ్లి పనులు చేసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొంది.
"మీరు అధికారిక విధులను నిర్వహిస్తే, అది ప్రయోజనాలకు విరుద్ధం అవుతుంది. అది మాకు అక్కరలేదు." అని బెంచ్ పేర్కొంది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే, ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన ఎలాంటి ఫైళ్లను కేజ్రీవాల్ పరిష్కరించరని సింఘ్వీ ధర్మాసనానికి హామీ ఇచ్చారు. మధ్యాహ్నం తరువాత తీర్పు వెలువడే అవకాశం ఉంది.
బెయిల్‌ను వ్యతిరేకించిన ఈడీ..
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ పై విచారణ జరుపుతున్న అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని ED వ్యతిరేకించింది "ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంపీలకు సంబంధించిన దాదాపు 5,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వారందరినీ బెయిల్‌పై విడుదల చేస్తారా? పంట, విత్తనాల సీజన్ ఉన్న వ్యవసాయదారుడు, రాజకీయవేత్త కంటే తక్కువ ముఖ్యమా?" అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈడీ తరఫున వాదనలు వినిపించారు.
కేజ్రీవాల్‌ విచారణకు సహకరించక, తొమ్మిది సమన్‌లను పట్టించుకోలేదని, అందుకే అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికలకు ముందు తనను అక్రమంగా అరెస్ట్ చేశారనే వాదనలు వినిపించారని, ఇప్పుడు ఆయన వాదనే నిజమవుతుందని అన్నారు.
"సాధారణ పౌరులతో పోలిస్తే రాజకీయ నాయకుడికి ప్రత్యేక హక్కులు లేవు. ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలందరినీ బెయిల్‌పై విడుదల చేయాలా?" అని సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించింది.
ఆలస్యంపై ఈడీ..
కుంభకోణం జరిగిన రెండేళ్ల వరకూ ఎందుకు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయలేదని దర్యాప్తు సంస్థను కోర్టు ప్రశ్నించింది. ఆయనపై చర్య తీసుకోవడానికి రెండేళ్లు ఎందుకు పట్టిందని న్యాయమూర్తులు ప్రశ్నలు సంధించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సాక్షులు, నిందితుల ముందు కొన్ని సంబంధిత ప్రశ్నలు ఎందుకు పెట్టలేదని కూడా అది ఏజెన్సీని ప్రశ్నించింది. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు దీనికి సమాధానం చెబుతూ.. మొదటిసారిగా దర్యాప్తులో కేజ్రీవాల ప్రధాన అంశంగా కనిపించలేదని, అయితే విచారణ కొనసాగుతున్న కొద్ది ఆయనే ప్రధాన నిందితుడని తేలిందని చెప్పారు.
"మేము దర్యాప్తు ప్రారంభించినప్పుడు, మా దర్యాప్తు నేరుగా అతనిపై (కేజ్రీవాల్) లేదు. దర్యాప్తు సమయంలో అతని పాత్ర వచ్చింది. అందుకే, ప్రారంభంలో, అతనికి సంబంధించి, ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. దర్యాప్తు అతనిపై దృష్టి పెట్టలేదు. ఎస్వీ రాజు అన్నారు. ఈ సందర్భంగా జార్జీ ఫెర్నాండేజ్ కేసును సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆయన జైలులో ఉన్నప్పటికీ భారీ మెజార్టీతో గెలిచాడని పేర్కొంది.


Read More
Next Story