
సభకు ముకుళిత హస్తాలతో ధన్యవాదాలు చెబుతున్న కేజ్రీవాల్ భార్య సునీత
కేజ్రీవాల్ జైలు నుంచి ఢిల్లీ ర్యాలీకి పంపిన సందేశం ఏమిటంటే...
ఢిల్లీ రాంలీలా మైదానం జనసంద్రమైంది. 28 పార్టీలతో కూడిన ఇండియా కూటమి ఈ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు కేజ్రీవాల్ జైలు నుంచి పంపిన సందేశంలో ఏముందంటే..
ఓట్ల కోసమో మరేదో రాజకీయ ప్రయోజనం కోసమో ఢిల్లీ ర్యాలీ చేపట్టలేదన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య సునీత. తన భర్తను మోదీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, అయితే కేజ్రీవాల్ ఎక్కువ కాలం జైలులో ఉండరని న్యాయం గెలిచి తీరుతుందన్నారు. తన భర్త దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడిలాంటి వాడని స్పష్టం చేశారు.
కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా ఫోరం భారీ ర్యాలీకి పిలుపు ఇచ్చింది. ఈ భారీ ర్యాలీలో కూటమిలోని 29 పార్టీలు పాల్గొన్నాయి. ఈ ర్యాలీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆయన భార్య సునీత చదివి వినిపించారు.
‘‘నేను ఓట్లు అడిగేందుకు ఇక్కడికి రాలేదు. నేను జైలులో ఉన్నాను. ఆలోచించుకునేందుకు చాలా సమయం ఇచ్చింది. ఈ రోజు భారత మాత బాధలో ఉంది’’ అని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు. ‘‘నవ భారతాన్ని నిర్మిద్దాం. ప్రతి వ్యక్తికి, ఉపాధి, మంచి విద్య, అందరికీ అందుబాటులో ఆరోగ్య భద్రత కల్పిస్తామని కేజ్రీవాల్ అన్నారు. ద్వేషం లేని దేశం, న్యాయం అందరికీ సమానంగా అమలయ్యే దేశాన్నీ నిర్మించాలి’’ అని పేర్కొన్నారు కేజ్రీవాల్.
తన ఇద్దరు సోదరీ మణులు కల్పన (జార్ఖండ్ మాజీ సీఎం భార్య), సునీత (కేజ్రీవాల్ భార్య)లకు మద్దతుగా నిలిచేందుకు ఇక్కడి వచ్చానని, ఇది ప్రచార ర్యాలీ కాదని శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్‌థాకరే నిప్పులు చెరిగారు. నియంతృత ్వ బిజెపి ప్రభుత్వం వారి భర్తలను అక్రమంగా జైలులో పెట్టిందని, వారికి దేశం యావత్తు మద్దతుగా నిలుస్తుందని చెప్పేందుకు ఇక్కడికి వచ్చానని అన్నారు. ఇడి, ఐటి, సిబిఐ బిజెపి భాగస్వామ్యులని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు సమయం ఆసన్నమైందని అన్నారు. అధికార పార్టీ వాషింగ్ మెషీన్ వంటిదని, వారి పార్టీలో చేరిన తర్వాత అవినీతి పరులు కూడా క్లీన్‌గా మారతారని ఎద్దేవా చేశారు. రైతులు కూడా ర్యాలీలో పాల్గొనాలని భావించారని, అయితే వారికి బిజెపి ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని అన్నారు. రైతులను తీవ్రవాదులుగా అభివర్ణించే ప్రభుత్వం పోవాలని, కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు.
నియంతృత్వ, మతతత్వ బిజెపి పార్టీ విధానాలను ఎండగట్టేందుకు, అరవింద్ కేజ్రీవాల్, హెమంత్ సోరెన్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో మహా ర్యాలీలో ప్రజలు, నాయకులు పాల్గంటున్నారని సిపిఎం నేత బృందాకారత్ అన్నారు. ఉపా చట్టాన్ని ఈడీ, సిబిఐ దర్యాప్తు సంస్థలను బిజెపి దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం సమర్థమంతమైనది కాదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.
రాజ్యాంగం దాడికి గురవుతోందని కాంగెస్ నేత సుప్రియా శ్రీనతే అన్నారు. ‘రాజ్యాంగం దాడికి గురవుతోంది. దేశం మొత్తం రాజ్యాంగ రక్షణకు కలిసికట్టుగా ముందుకువెళ్తోంది. ఇదే విషయాన్ని విషయాన్ని తెలియజేయటానికి ర్యాలీకి హాజరవుతున్నా’ అని అన్నారు.
ఢిల్లీ ప్రజల కోసమే కేజ్రీవాల్ ఆందోళన..
రాంలీలా మైదనం వద్దకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు ఢిల్లీ మంత్రి ఆతిషీ. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల జీవితాలను మార్చారని వారికి తెలుసు. ఆయన అరెస్ట్ అయ్యాక కూడా ఢిల్లీ ప్రజల కోసం ఆందోళన పడుతున్నారు’ అన్నారు మంత్రి అతిషీ.
Next Story

