‘ఇండియా ’అలయెన్స్ చైర్ పర్సన్ గా ఖర్గే?
x
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

‘ఇండియా ’అలయెన్స్ చైర్ పర్సన్ గా ఖర్గే?


వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జట్టు కట్టున ప్రతిపక్షాలు, తమ ఉమ్మడి నాయకుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ను నియమించడంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. కూటమి నాయకులు శనివారం వర్చువల్ పద్దతిలో సమావేశం అయ్యారు. వచ్చే లోక్ సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహలు, సీట్ల షేరింగ్ వంటి అంశాలను చర్చించినట్లు సమాచారం.

అయితే ఈ సమావేశాలకు తృణమూల్ కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, సమాజ్ వాదీ పార్టీ నాయకులు హజరుకాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కూటమి చైర్ పర్సన్ గా ఖర్గే నియామకం పై ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బీహర్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ను కూటమి కన్వీనర్ గా చేయాలని కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదీ కూడా ఇతర విపక్ష నాయకులను సంప్రదించి ఏకాభిప్రాయం వ్యక్తం అయిన తరువాతనే అధికారిక ప్రకటన రానుంది.

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొడానికి 28 ప్రతిపక్ష పార్టీలు కలిసి ఐఎన్డీఐ కూటమిగా జతకట్టిన సంగతి తెలిసిందే. దీనికి కన్వీనర్, సీట్ల సర్ధుబాటు తో పాటు పలు అంశాలను చర్చించేందుకు ఇప్పటికే నాలుగుసార్లు సమావేశం అయ్యారు.

Read More
Next Story