
కుల గణనపై ప్రధాని మోదీకి లేఖ రాసిన ఖర్గే..
‘‘రిజర్వేషన్లపై అమలులో ఉన్న 50 శాతం గరిష్ఠ పరిమితిని తొలగించి, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం 15(5) అధికరణను అమలు చేయాలి.’’
కుల గణన(Caste survey)పై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Kharge) ప్రధాని మోదీ(PM Modi)ని కోరారు. వెనుకబడిన, దళిత, ఆదివాసీ, ఇతర సామాజిక వర్గాలకు సంపూర్ణ సామాజిక, ఆర్థిక న్యాయం జరగాలంటే కుల గణన తప్పనిసరి అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లపై అమలులో ఉన్న 50 శాతం గరిష్ఠ పరిమితిని తొలగించి, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగం 15(5) అధికరణను తక్షణమే అమలు చేయాలని ఖర్గే ఒక లేఖలో మోదీని కోరారు. కులగణన విషయంలో తెలంగాణలో అమలు చేసిన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అందులో రాసుకొచ్చారు.
जातिगत जनगणना पर प्रधानमंत्री @narendramodi जी को मेरा पत्र
— Mallikarjun Kharge (@kharge) May 6, 2025
पत्र के कुछ अंश साझा कर रहा हूँ, पूरा पत्र संलग्न है —
मैंने 16 अप्रैल 2023 को आपको पत्र लिखकर भारतीय राष्ट्रीय कांग्रेस द्वारा जातिगत जनगणना कराने की मांग आपके समक्ष रखी थी। अफ़सोस की बात है कि मुझे उस पत्र का कोई… pic.twitter.com/FAeZ0jkAfY
ఖర్గే లేఖను కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీన్ని మే 2న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశ అనంతరం ఖర్గే ప్రధానికి రాశారని ఆయన పేర్కొన్నారు.