
Yuvagalam Padayatra
ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చేందుకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం జైత్రయాత్ర పూర్తయింది. ఈ ఏడాది జనవరి 27వతేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,094 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3,132 కి.మీ.ల మేర సాగింది.
పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు, తారకరత్న మరణం వంటి అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎటువంటి విరామలేకుండా నారా లోకేష్ పాదయాత్ర సాగింది. రాయలసీమలో 48 డిగ్రీల మండుటెండల్లో సైతం యువగళం ఆగలేదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జోరువర్షంలో సైతం యాత్రను కొనసాగించారు.
యువగళం పాదయాత్రలో లోకేష్ 70 బహిరంగసభలు, 154 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి రాతపూర్వకంగా 4,353 వినతిపత్రాలు అందుకున్నారు. 226 రోజుల పాటు సాగిన సుదీర్ఘ పాదయాత్ర ఇది. కోటిన్నర మంది ప్రజలు యువనేతతో కనెక్ట్ అయ్యారు. జనగళమే యువగళంగా సాగిన లోకేష్ పాదయాత్ర ప్రజాచైతన్యం సాధించడంలో అంచనాలకు మించి విజయవంతమైంది.
ఉమ్మడి జిల్లాల వారీగా యువగళం పాదయాత్ర వివరాలు
1). చిత్తూరు – 14 నియోజకవర్గాలు – 45రోజులు – 577 కి.మీ.
2). అనంతపురం – 9 నియోజకవర్గాలు – 23రోజులు – 303 కి.మీ.
3). కర్నూలు – 14 నియోజకవర్గాలు – 40రోజులు – 507 కి.మీ.
4). కడప – 7 నియోజకవర్గాలు – 16రోజులు – 200 కి.మీ.
5). నెల్లూరు – 10 నియోజకవర్గాలు – 31రోజులు – 459 కి.మీ.
6). ప్రకాశం – 8 నియోజకవర్గాలు – 17రోజులు – 220 కి.మీ.
7). గుంటూరు – 7 నియోజకవర్గాలు – 16రోజులు – 236 కి.మీ.
8). కృష్ణా జిల్లా – 6 నియోజకవర్గాలు – 8రోజులు – 113 కి.మీ.లు
9). పశ్చిమగోదావరి – 8 నియోజకవర్గాలు – 11రోజులు – 225.5 కి.మీ.
10). తూర్పుగోదావరి – 9 నియోజకవర్గాలు – 12రోజులు – 178.5 కి.మీ.
11). విశాఖపట్నం జిల్లా – 5 నియోజకవర్గాలు – 7రోజులు – 113 కి.మీ.
శ్రీకాకుళం జిల్లా మీదుగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భూమాత లేఅవుట్స్ ప్రాంతంలో జరిగే బహిరంగ సభతో యాత్ర ముగుస్తుంది. ఈనెల 20 ముగింపు సభ జరుగుతుందని ఇప్పటికే టీడీపీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
మొత్తం – 97 నియోజకవర్గాలు – 226రోజులు – 3132 కి.మీ.
ప్రతి వంద కిలోమీటర్లకు ఒక వరం!
యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత నారా లోకేష్ ప్రతి వంద కిలోమీటర్ల మజిలీలో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ తాము అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే తమను నిలదీయవచ్చని చెబుతున్న దమ్మున్న నేత యువనేత నారా లోకేష్.
పాదయాత్ర 8వ రోజు (3–2–2023) పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో 100వ కిలోమీటరు వద్ద కిడ్నీవ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు శిలఫలకాన్ని ఆవిష్కరించారు.
పాదయాత్ర 224వ రోజు (16–12–2023) అనకాపల్లి నియోజకవర్గం జివిఎంసి 81వవార్డులోని గౌరి గ్రంథాలయం వద్ద 3,100 కి.మీ.ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాక చోడవరం – అనకాపల్లి మధ్య రైల్వే బ్రిడ్జి పూర్తిచేస్తామని హామీ ఇస్తూ లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
Next Story