మాఘ పౌర్ణమికి పోటెత్తిన భక్తులు - కుంభమేళాకు క్యూ కట్టిన వాహనాలు
x

మాఘ పౌర్ణమికి పోటెత్తిన భక్తులు - కుంభమేళాకు క్యూ కట్టిన వాహనాలు

"భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతాం," - డివిజనల్ రైల్వే మేనేజర్ రాజేష్ గుప్తా


Click the Play button to hear this message in audio format

రేపు (ఫిబ్రవరి 12) మాఘ పౌర్ణమి(Maha Kumbh) సందర్భంగా కుంభమేళా(Maha Kumbh)లో అమృత స్నానానికి లక్షలాదిగా భక్తులు ప్రయాగరాజ్‌కు చేరుకుంటున్నారు. 300 కిలోమీటర్ల వరకు భారీ ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. అయినా భక్తులు పుణ్యస్నానానికి వెనుకాడడం లేదు.


భదోహిలో సాఫీగా వాహనాల రాకపోకలు..

ప్రయాగరాజ్-వారణాసి మార్గంలోని భదోహిలో ట్రాఫిక్ సమస్య లేదు. గత వారం రోజులుగా రోజుకు 50 వేలకు పైగా వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి.

ఆదివారం రాత్రి 6 గంటల పాటు టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతో కొన్ని గంటలపాటు టోల్ గేట్లను ఉచితంగా తెరిచారు. సోమవారం రాత్రి మిర్జాపూర్ వైపు వెళ్తున్న వాహనాలను భదోహిలో నిలిపి ఉంచి, ఆపై క్రమంగా వదిలారు. భదోహి ఎస్పీ అభిమన్యు మాంగ్లిక్ మాట్లాడుతూ.. " కుంభమేళా మార్గాల్లో ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేదు. మాఘ పౌర్ణమి అమృత స్నానాన్ని దృష్టిలో ఉంచుకుని, హైవేపై ట్రాఫిక్ విభాగాన్ని 24 గంటలూ అప్రమత్తంగా ఉంచాం" అని చెప్పారు.

మంగళవారం ప్రయాగరాజ్-మిర్జాపూర్ హైవేలో ట్రాఫిక్ సాధారణంగా ఉంది. మండా వద్ద వాహనాల రాకపోకలకు ఏ సమస్య లేదు. వింద్యాచల్ నుంచి నత్వా వరకు 4 కిలోమీటర్ల మేర కొంత ట్రాఫిక్ సమస్య తలెత్తింది. నత్వా ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు.

కౌశాంబిలో..

కౌశాంబిలో మూడు రోజులపాటు ట్రాఫిక్ జామ్ కొనసాగిన తర్వాత మంగళవారం ఉదయం నుంచి హైవేపై రాకపోకలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఇక కాన్పూర్-ప్రయాగరాజ్ జాతీయ రహదారి 2పై ట్రాఫిక్ జామ్ కాలేదు.

ప్రతాప్‌గఢ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు..

ప్రయాగరాజ్-అయోధ్య మార్గంలో ట్రాఫిక్ సమస్య తలెత్తలేదు. భూపియామౌ నేషనల్ హైవే 96లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు రోడ్ డైవర్షన్ చేశారు. భారీ వాహనాలను అయోధ్య వైపుగా మళ్లించారు. జిల్లా కలెక్టర్ శివ సహాయ్ అవస్థి, ఎస్పీ అనిల్ కుమార్ భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.

ప్రత్యేక రైళ్లు ..

మాఘ పౌర్ణమి అమృత స్నానం దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక కుంభ రైళ్లను నడుపుతోంది. సోమవారం రాత్రి 10 గంటల వరకు 24 ప్రత్యేక రైళ్లు ప్రయాగరాజ్ నుండి పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ స్టేషన్‌కు చేరుకున్నాయి. 21 ప్రత్యేక రైళ్లు అక్కడి నుండి ప్రయాగరాజ్ వైపు బయలుదేరాయి. గయా, ససారాం, దేహ్రీ (బీహార్) ప్రాంతాల నుంచి అదనపు రైళ్లు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. "భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతాం," అని డివిజనల్ రైల్వే మేనేజర్ రాజేష్ గుప్తా తెలిపారు.

Read More
Next Story