మణిపూర్ కొత్త సీఎం ఎవరు? బీజేపీకి అతిపెద్ద సవాల్..
x

మణిపూర్ కొత్త సీఎం ఎవరు? బీజేపీకి అతిపెద్ద సవాల్..

మణిపూర్‌‌లో వర్గపోరుకు అంతం ఎప్పుడు? తారాస్థాయికి చేరిన విభేదాలకు బీజేపీ అధిష్టానం చెక్ పెడుతుంది. అందుకు సీఎం ఎంపిక విషయంతో ఆచితూచీ వ్యవహరిస్తున్నారా?


Click the Play button to hear this message in audio format

మణిపూర్‌(Manipur)కొత్త ముఖ్యమంత్రిని నియమించేందుకు బీజేపీ(BJP)అధిష్ఠానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సోమవారం (ఫిబ్రవరి 11) ఇంఫాల్‌లో బీజేపీ కీలక నేతలతో రహస్య సమావేశం నిర్వహించింది. ఇటు కుకి-జో సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో పార్టీ కేంద్ర నాయకత్వం ఈ వారం చివర్లో ఢిల్లీలో భేటీ కానుంది.


బిరెన్ సింగ్‌ (Biren Singh) రాజీనామా?

కుకి-జో (Kuki-Zo) సామాజిక వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు (వీరిలో ఏడుగురు బీజేపీకి చెందిన వారు) మణిపూర్‌లో వర్గపోరుకు మాజీ సీఎం ఎన్. బిరెన్ సింగ్‌ను బాధ్యుడిని చేశారు. ఆయన పక్షపాతపూరిత ప్రవర్తన వల్లే 250 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. విస్తృత నిరసనల కారణంగా సింగ్ ఫిబ్రవరి 9న తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

బీజేపీకి అసలు సవాల్..

బీజేపీ నాయకత్వం ముందున్న అసలు సవాలు - మైతేయి(Meitei), కుకి సామాజిక వర్గాల మధ్య సమస్యను పరిష్కరిచడం. అందరిని కలుపుకుని పార్టీని సమర్థవంతంగా నడిపే నాయకుడి కోసం బీజేపీ అన్వేషిస్తోంది. బీజేపీ అధిష్ఠానంతో సమావేశం జరగాల్సి ఉన్నా.. అది రెండు రోజుల పాటు ఆలస్యమయ్యే అవకాశముందని కుకి ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.

ఈ నేపథ్యంలో బీజేపీ ఈశాన్య రాష్ట్రాల ఇన్‌చార్జి సంబిత్ పాత్రా.. స్పీకర్ టీ. సత్యబ్రత సింగ్, విద్యా శాఖ మంత్రి వై. ఖేమ్‌చంద్, మాజీ మంత్రి థా. రాధేశ్యామ్, మంత్రి అవాంగ్‌బోయ్ న్యూమైతో ఇంఫాల్‌లో సమావేశమయ్యారు. వీరంతా సింగ్ స్థానానికి సరితూగే వ్యక్తులు.

కొన్ని వార్తా నివేదికల ప్రకారం.. కుకి వర్గానికి ఖేమ్‌చంద్‌పై వ్యతిరేకత లేదని తెలుస్తోంది. అయితే రెండు వర్గాలకు ఆమోదయోగ్య వ్యక్తిని ఎంపిక చేయాల్సిన అవసరం బీజేపీకి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి.

అసమ్మతే కారణమా?

బిరెన్ సింగ్ రాజీనామా చేయడానికి ప్రధాన కారణం..ఆయనపై అసమ్మతి పెరిగిపోవడమే. బీజేపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంతో కలిసి సింగ్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. దీనికి భయపడి అసెంబ్లీ సమావేశాన్ని బీజేపీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఖేమ్‌చంద్ మనసులో మాట..

ఇక ఖేమ్‌చంద్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తాను బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడమే ప్రస్తుత లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఖేమ్‌చంద్, బిశ్వజిత్, సత్యబ్రత సింగ్ లాంటి నేతలకు మద్దతు కూడగట్టడం అంత తేలికైన పని కాదు. ఎందుకంటే సింగ్‌కు ఇప్పటికీ దాదాపు 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు.

భద్రత కట్టుదిట్టం..

మణిపూర్‌లో రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో.. భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. 2023 మే నుంచి జరిగిన ఘర్షణల్లో మణిపూర్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇంఫాల్ వ్యాలీలో మైతేయి వర్గం అధికం. పరిసర కొండ ప్రాంతాల్లో కుకి-జో గిరిజన సమూహాలు ఉంటాయి.

60 వేల మంది శరణార్థులు..

గత 21 నెలల్లో జరిగిన దాడుల్లో 250 మంది ప్రాణాలు కోల్పోగా, 60 వేల మంది ఇళ్లను వదిలి శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గత మూడేళ్లుగా ప్రజలు తమ సొంత రాష్ట్రంలోనే శరణార్థులుగా మారిపోయారు.


Read More
Next Story