
‘ఆపరేషన్ సింధూర్’ సైనిక అధికారులకు సర్వోత్తమ యుద్ధ సేవా పతకాలు
పతకాలు అందుకుంటున్న వారిలో డిప్యూటీ కమాండెంట్ ర్యాంక్ అధికారి, ఇద్దరు అసిస్టెంట్ కమాండెంట్లు, ఒక ఇన్‌స్పెక్టర్ ఉన్నారు..
స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15న) రోజున ‘ఆపరేషన్ సింధూర్’లో చూపిన శౌర్యానికి గాను ఏడుగురు సైనిక అధికారులు విశిష్ట సేవా పతకాలు అందుకోనున్నారు. వీరిలో నలుగురు ఐఏఎఫ్ అధికారులతో పాటు, ఇద్దరు ఆర్మీ అధికారులు, ఒక నేవీ అధికారి ఉన్నారు. నలుగురు భారత వైమానిక దళం (IAF) అధికారులకు సర్వోత్తమ యుద్ధ సేవా పతకాన్ని(Sarvottam Yudh Seva Medal) అందజేయనున్నారు. ఈ సేవా పతకాన్ని చివరిసారిగా కార్గిల్ యుద్ధం తర్వాత IAFకి పంపిణీ చేశారు. యుద్ధం సమయంలో అసాధారణ సేవలకు గుర్తింపుగా సైనికులకు ఈ పతకం ప్రదానం చేస్తారు. పతక విజేతలలో డిప్యూటీ కమాండెంట్ ర్యాంక్ అధికారి, ఇద్దరు అసిస్టెంట్ కమాండెంట్లు, ఒక ఇన్‌స్పెక్టర్ ఉన్నారు.
జమ్ము, కశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam)లోకి ఉగ్రమూకలు ప్రవేశించి 26 మంది పర్యాటకులను ఏప్రిల్ 22న కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టి మే 7 నుంచి 10 వరకు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది.