
‘మార్చి 2026 నాటికి నక్సల్ రహిత దేశంగా భారత్’
కేంద్ర మంత్రి అమిత్ షా..
నక్సల్(Naxals) రహిత దేశమే తమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. మార్చి 2026 నాటికి ‘నక్సల్ ప్రీ నేషన్’ చేస్తామని ప్రకటించారు. నక్సలైట్లంతా లొంగిపోయే వరకు, నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టే వరకు మోదీ ప్రభుత్వం విశ్రమించదని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని కర్రెగుట్ట కొండపై ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’లో పాల్గొన్న CRPF, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), కోబ్రా జవాన్లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో వారు చూపిన ధైర్యసాహనాలను షా ప్రశంసించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని.. సంక్షేమ పథకాలను అడ్డుకుని ప్రజలకు చాలానష్టం కలిగించారని షా చెప్పారు. "పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు" కొనసాగుతోన్న నక్సల్ ఏరివేత ఆపరేషన్.. 6.5 కోట్ల మంది ప్రజలకు ఒక "కొత్త సూర్యోదయం" అని చెప్పారు. నక్సల్స్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన భద్రతా సిబ్బందికి, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా పాల్గొన్నారు.