అమర జవాన్లకు ప్రధాన మోదీ ఘన నివాళి
x

అమర జవాన్లకు ప్రధాన మోదీ ఘన నివాళి

25 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్‌ యుద్ధంలో భారత భూభాగాన్ని రక్షించేందుకు ధైర్యంగా పోరాడిన సాయుధ బలగాలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నివాళి అర్పించారు.


25 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్‌ యుద్ధంలో భారత భూభాగాన్ని రక్షించేందుకు ధైర్యంగా పోరాడిన సాయుధ బలగాలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నివాళి అర్పించారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా.. దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన సాయుధ దళాల అధికారులు, సైనికులకు నివాళులు అర్పించేందుకు ప్రధాని మోదీ ద్రాస్ వార్ మెమోరియల్ వద్దకు చేరుకున్నారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుని అమర జవాన్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

మీ త్యాగం మరువలేనిది: ముర్ము

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ‘‘దేశ సాయుధ దళాల పరాక్రమం ధైర్ఘ్యానికి ప్రతీక. కార్గిల్‌ యుద్ధంలో మాతృభూమి కోసం ప్రాణ త్యాగం చేసిన జవాన్లందరికీ నివాళులర్పిస్తున్నా. వారి త్యాగం, శౌర్యం స్ఫూర్తిదాయకం’’ అని ముర్ము ఎక్స్‌ వేదికగా పోస్ట్‌లో పేర్కొన్నారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. "సైనికుల శౌర్యం, దేశభక్తి దేశాన్ని సురక్షితంగా ఉండేలా చేశాయి. వారి సేవ, త్యాగం ప్రతి భారతీయుడికి, రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది.’’ అని రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

వీర సైనికులకు నివాళులు అర్పించిన వారిలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఉన్నారు.

కార్గిల్ డే..

మే 5, 1999 సంవత్సరం మన దేశ భూభాగంలోకి పాకిస్తాన్ ప్రవేశించింది. మే నుంచి జులై వరకు కార్గిల్ పర్వత శ్రేణులలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. దాదాపు 84 రోజుల పాటు జరిగిన యుద్ధం సాగింది. చివరకు జులై 26, 1999న భారతదేశం విజయం సాధించింది. భారత సైనికుల త్యాగం, ధైర్యాన్ని స్మరించుకుంటూ ఏటా జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నాం.

Read More
Next Story