వక్ఫ్ చట్టంపై సుప్రీం మధ్యంతర స్టే..
x

వక్ఫ్ చట్టంపై సుప్రీం మధ్యంతర స్టే..

SC తీర్పు NDA మిత్రపక్షాలకు ఎదురుదెబ్బెనా?


Click the Play button to hear this message in audio format

ఈ ఏడాది ఏప్రిల్‌లో వక్ఫ్ (సవరణ) (Waqf Act) బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాల నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వారి హెచ్చరికలను ఏ మాత్రం లెక్కచేయని సీనియర్ జేడీ (యూ) ఎంపీ కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ 'లాలన్' లోక్‌సభలో లేచి బిల్లును గట్టిగా ఆమోదించారు. బిల్లు "రాజ్యాంగ విరుద్ధం" అని అభివర్ణించిన ప్రతిపక్ష సభ్యులను లాలన్ తీవ్రంగా విమర్శించారు. ప్రతిపాదిత చట్టం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో చాలా అవసరమైన సంస్కరణలు తీసుకువస్తుందని చెప్పడంతో జేడీ(యూ)లోని కొన్ని వర్గాల నుంచి వెంటనే వ్యతిరేకత వచ్చింది. బిల్లును పార్లమెంటు ఆమోదించిన కొద్ది రోజుల్లో జేడీ(యూ)కు రాజీనామాల సెగ తగిలింది. దాదాపు డజను మంది ఆఫీస్ బేరర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు జేడీ(యూ) నుంచి నిష్క్రమించారు. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి వస్తున్న సమయంలో రాష్ట్రంలోని పెద్ద సంఖ్యలో ముస్లిం సంస్థలు బిల్లుకు మద్దతు ఇవ్వవద్దని ముఖ్యమంత్రి జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్‌ను హెచ్చరించాయి కూడా. ఇలాంటి హెచ్చరికలు బీహార్‌లోని NDA భాగస్వాములయిన లోక్ జనశక్తి పార్టీ-రామ్ విలాస్ (LJP-RV) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) చీఫ్ ఉపేంద్ర కుష్వాహాకు కూడా వచ్చాయి.

అయితే సుప్రీంకోర్టు వక్ఫ్ (సవరణ) బిల్లుపై సోమవారం (సెప్టెంబర్ 15) మధ్యంతర స్టే విధించడంతో ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఈ ముగ్గురు NDA సభ్యులను నిశ్శబ్దం కమ్మేసింది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 50 స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంతో ముస్లింలు కీలక పాత్ర పోషిస్తారని జేడీ(యూ) వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఈ స్థానాల్లో పార్టీ తన పట్టును నిలుపుకోవడం కష్టమని అంటున్నారు.


బీజేపీకి ప్రతి వ్యూహం ఉందా?

ఇటు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(SIR)కు వ్యతిరేకంగా JD(U) ఇతర NDA మిత్రపక్షాలు ఏ మాత్రం వ్యతిరేకతను కనపరచలేదు. అయితే ముస్లిం ప్రాబల్యం ఉన్న సీమాంచల్, కొన్ని ఇతర స్థానాల్లో కూటమి ఎదుర్కొనే నష్టాన్ని పూడ్చడానికి SIR వ్యూహం ఉపయోగపడుతుందని ఒక సీనియర్ NDA నాయకుడు అన్నారు.

Read More
Next Story