
ఉపరాష్ట్రపతిగా ఎన్నికయిన NDA అభ్యర్థి CP రాధాకృష్ణన్..
సీపీ రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించగా.. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పడ్డాయి.
CP రాధాకృష్ణన్ భారతదేశ ఉపరాష్ట్రపతిగా(Vice President) ఎన్నికయ్యారు. (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) NDA తరుపున బరిలో నిలిచిన ఈయనపై I.N.D.I.A కూటమి నుంచి బి సుదర్శన్ రెడ్డి(B Sudershan Reddy) పోటీచేశారు. పార్లమెంటు(Parliament) భవనంలోని రూం నంబర్ 101లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రధాని మోదీ(PM Modi)తో పాటు కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటింగ్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు మొదలైంది. మొత్తం 781 సభ్యుల్లో 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీపీ రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించారు. సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు పడ్డాయి. కాగా మూడు పార్టీలు బిజూ జనతాదళ్, భారత రాష్ట్ర సమితి, శిరోమణి అకాలీదళ్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. రాజ్యసభ స్పీకర్ జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఈ ఎన్నిక జరిగింది. గెలుపొందినట్లు ప్రకటించిన వెంటనే CP రాధాకృష్ణన్ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని కూడా ఆయనకు అభినందనలు చెప్పారు.