
BLOలకు అందని 14 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు..
ఇప్పటి దాకా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముగ్గురు బూత్ లెవర్ ఆఫీసర్లు చనిపోయారని స్పష్టం చేసిన ఎలక్షన్ కమిషన్
పశ్చిమ బెంగాల్(West Bengal)లో దాదాపు 14 లక్షల S.I.R ఎన్యుమరేషన్ ఫారాలు BLOలకు అందలేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు స్థానికంగా లేకపోవడం, లేదా రెండు చోట్ల నమోదయి ఉండడం, లేదా చనిపోయి ఉండవచ్చని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. "మంగళవారం మధ్యాహ్నానికి ఈ సంఖ్య 13.92 లక్షలుగా ఉంది.రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది,’’ అని అన్నారు.
ముగ్గురు BLOల మృతి..
రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నుంచి డేటాను సేకరించే పనిలో ఉన్న బూత్ లెవల్ అధికారులు (BLOలు) నిమగ్నమై ఉన్నారని, రాష్ట్రంలో మొత్తం 80,600 మందికి పైగా బిఎల్‌వోలు, దాదాపు 8వేల మంది సూపర్‌వైజర్లు, 3వేల మంది అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, 294 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు S.I.R విధుల్లో ఉన్నారని ఎలక్షన్ అధికారులు తెలిపారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో ముగ్గురు BLOలు మరణించారని పేర్కొన్నారు..
S.I.Rకు వ్యతిరేకంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ ర్యాలీలు నిర్వహిస్తోంది. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో విధులు నిర్వహిస్తున్న బీఎల్‌లోలు పని ఒత్తిడి భరించలేక చనిపోతున్నారని, తక్షణం S.I.R నిలిపివేయాలని TMC డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

