రాజ్-ఉద్దవ్ పొత్తుపై సంజయ్ రౌత్ ఏమన్నారంటే..
x

రాజ్-ఉద్దవ్ పొత్తుపై సంజయ్ రౌత్ ఏమన్నారంటే..

మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరేతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ముందస్తు షరతు విధించలేదని స్పష్టం చేసిన ఎంపీ


Click the Play button to hear this message in audio format

తమ పార్టీ శివసేన (UBT) మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్)తో పొత్తు పెట్టుకోవడం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదని, అయితే ఇద్దరి మధ్య "భావోద్వేగ చర్చలు" జరుగుతున్నాయని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) చెప్పారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరేతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే ముందస్తు షరతు విధించలేదని కూడా రౌత్ స్పష్టం చేశారు.

"రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే ఇద్దరూ మహారాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతారు. అయితే బీజేపీ అందుకు సరిపోదు’’ అని రౌత్ అన్నారు.

చిత్రనిర్మాత మహేష్ మంజ్రేకర్‌, రాజ్ థాకరే కలిసి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. అవిభక్త శివసేనలో ఉద్ధవ్‌తో కలిసి పనిచేసేటప్పుడు తనకు ఏ సమస్యలు లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య సత్సంబంధాల గురించి ప్రచారం జోరందుకుంది.

"మరాఠీ మనూస్" ప్రయోజనాల కోసం ఐక్యంగా ఉండటం కష్టం కాదని రాజ్ థాకరే చెప్పగా .. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం తాను కూడా సిద్ధంగా ఉన్నానని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు.

ఇదిలా ఉండగా.. “ఇద్దరు సోదరులు కలిసి రావాలని అందరూ భావిస్తారు. కానీ మరాఠీ విషయంలో మీరు (మాకు) మద్దతు ఇవ్వకపోతే ఎలా ముందుకు వెళ్లగలం 'మరాఠీ మనూస్' ప్రయోజనాల కోసం మరాఠీ ప్రజలందరూ కలిసి రావాలనేది ఆయన వైఖరి. అదే ఆయన వైఖరి. మీరు దాని గురించి చాలా చదువుతున్నారు, ”అని ముంబై ఎంఎన్ఎస్ చీఫ్, పార్టీ ప్రతినిధి సందీప్ దేశ్‌పాండే అన్నారు.

Read More
Next Story