దోచుకున్నదంతా ప్రజలకు ఇచ్చేస్తాం: ప్రధాని మోదీ
బెంగాల్ లో ఉద్యోగాలు ఇవ్వడానికి దోచుకున్న సొమ్మంతా అవినీతిపరుల నుంచి ఈడీ జప్తు చేసిందని, అదంతా తిరిగి బాధితులకు అందిస్తామని ప్రధాని ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ దోచుకున్న ప్రజల నుంచి దోచుకున్న రూ. 3000 కోట్లను జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ సీజ్ చేసిందని, వాటిని తిరిగి పేదలకు పంచుతామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రతిపక్షాల మొదట ధ్యేయం దేశం కాదని, అధికారం అని ప్రధాని విమర్శలు గుప్పించారు.
కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గంలో టిఎంసికి చెందిన మహువా మోయిత్రాపై బిజెపి అభ్యర్థి, నాదియా రాజకుటుంబానికి చెందిన అమృతా రాయ్‌తో ఫోన్ సంభాషణలో మోదీ ఈ ప్రకటన చేశారు పేదల నుంచి దోచుకున్న డబ్బును అవినీతిపరుల నుంచి ED జప్తు చేసిన ఆస్తులు, డబ్బు తిరిగి ప్రజలకు వెళ్లేలా చూసేందుకు చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తున్నట్లు 'రాజ్‌మాత' అమృతా రాయ్‌తో ప్రధాని మోదీ చెప్పారు," అని ఒక బిజెపి నాయకుడు వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్ లో ఉద్యోగాలు ఇవ్వడానికి అధికార పార్టీ ప్రజల నుంచి వివిధ రూపాల్లో రూ. 3 వేల కోట్లను వసూలు చేసిందని, తిరిగి వాటిని వారికే ఇచ్చివేస్తామని ప్రధాని ఉద్ఘాటించినట్లు వారు వెల్లడించారు. తన మార్గం గురించి ప్రజలకు చెప్పాలని, అధికారంలోకి రాగానే మొదట ఈ పనే చేస్తానని, అవసరమైతే చట్టపరమైన మార్గంలోనే, నిబంధనలను అనుసరించి ఒక మార్గం కనుగొంటామని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో లిక్కర్ స్కాంకు పాల్పడి, ఇప్పుడు కటకటాల్లో ఉన్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు కాంగ్రెస్ మద్ధతు తెలిపిందని విమర్శించారు. ఎవరైతే లిక్కర్ స్కామ్ అని ఆరోపించారో వారే ఇప్పుడు కేజ్రీవాల్ సచ్చిలుడు అంటున్నారని విమర్శించారు ( ఢిల్లీ లిక్కర్ స్కామ్ వివరాలు బయటపెట్టింది మొదట కాంగ్రెస్ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్, మరో కాంగ్రెస్ నేత బయటపెట్టారు)
"ఇది వారి ప్రాధాన్యత. వారికి దేశం కాదు అధికారం ముఖ్యం అని చూపిస్తుంది," అని ఆయన అన్నారు, బిజెపి నేతృత్వంలోని కూటమి యువత ఉజ్వల భవిష్యత్తు, అవినీతి రహిత దేశం కోసం పోరాడుతోందని, అవినీతిపరులందరూ మరొక వైపు ఏకమయ్యారు. ఒకరినొకరు రక్షించుకుంటారు" అని ప్రధాని ఆరోపించారు
కృష్ణా నగర్ లో అమృతా రాయ్ ను బీజేపీ అభ్యర్థిగా నిలిపాక, ఆమె కుటుంబాన్ని బ్రిటిష్ వారికి బానిసగా వ్యవహరించిందని పలువురు విమర్శలు గుప్పించారు. వాటిని ఈసందర్భంగా ప్రధానికి రాయ్ వివరించారు. తన కుటుంబాన్ని దేశద్రోహులుగా పిలుస్తున్నారని, కృష్ణచంద్ర రాయ్ ప్రజల కోసం పనిచేశారని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఇతర రాజులతో చేతులు కలిపారని ఆమె మోదీకి చెప్పారు.
వారు (టిఎంసి) ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, రకరకాల ఆరోపణలు చేస్తారని, ఎటువంటి ఒత్తిడికి గురికావద్దని ఆయన కోరారు. తమ పాపాలను దాచుకునేందుకే ఎదుటివారిపై నిందలు వేస్తున్నారని ప్రధాని, ఆమెకు చెప్పారు.
"ఇది వారి ద్వంద్వ ప్రమాణాలు" అని మోదీ అన్నారు, రాజు సామాజిక సంస్కరణలు, అభివృద్ధి వారసత్వాన్ని ప్రశంసించారు. అతని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఇప్పుడు మాట మార్చారని అన్నారు. ఆమె గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, తన నియోజకవర్గానికి సంబంధించి మొదటి 100 రోజుల ఎజెండాతో సిద్ధంగా ఉండాలని రాయ్‌ని కోరారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో "పరివర్తన్" (మార్పు) కోసం ఓటు వేస్తుందని కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మోడీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారని, ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత టిఎంసి ఎంపి మోయిత్రా జైలుకు వెళతారని తనకు చెప్పారన్నారు. లంచం, ఇతర ప్రయోజనాలకు ప్రతిఫలంగా తన పార్లమెంటరీ లాగిన్‌ను ఉపయోగించుకోవడానికి వ్యాపారవేత్తను అనుమతించారనే ఆరోపణలపై మోయిత్రా అవినీతి కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.
2019లో రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు గాను 18 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది మరియు ఈసారి తన సంఖ్యను పెంచుకోవాలని చూస్తోంది.
Next Story