బెంగాల్ లో శ్రీరామ నవమికి బీజేపీ అంతా సిద్ధం చేసుకుంది
x

బెంగాల్ లో శ్రీరామ నవమికి బీజేపీ అంతా సిద్ధం చేసుకుంది

పోలింగ్ జరగడానికి రెండు రోజుల ముందు శ్రీరామ నవమి వస్తుంది. ఈసారి బెంగాల్ లో రామనవమికి స్థానిక ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే..


భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం ఏడు విడతల్లో దేశంలో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సరిగ్గా పోలింగ్ ప్రారంభానికంటే ముందే దేశంలో శ్రీరామనవమి రానుంది. ఏప్రిల్ 17న శ్రీ రాముడి జన్మదినం.

భారతీయ జనతా పార్టీ (BJP) పశ్చిమ బెంగాల్‌లో హిందూత్వ భావాలను రెచ్చగొట్టడానికి శ్రీరామనవమిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో దేవుడి పేరుమీద రాజకీయాలు అనే అంశంపై పలువురు నాయకులు విభేదించినప్పటికీ వాస్తవం దృశ్యం మాత్రం ఇదే. అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠించిన జనవరి 22న రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, కీలకమైన సంఘ్ పరివార్ రామ పూజ సభలను నిర్వహించాయి.
రాముడి పేరుతో తీర్థయాత్రలు
అయోధ్య రామాలయం ప్రారంభం తరువాత బెంగాల్ లోని హిందూవులకు అయోధ్య యాత్ర చేయడానికి బీజేపీ ఆఫర్ ఇచ్చింది. దీనికి రాష్ట్రంలో మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పటివరకు దాదాపు 50,000 మంది యాత్రికులు తీర్థయాత్ర ఆఫర్‌ను వినియోగించుకున్నారు. వీరికి ఉచితంగా అక్కడ సౌకర్యాలు కూడా కల్పించారు.
రామాలయ ప్రారంభోత్సవం చుట్టూ ఉన్న ప్రతిస్పందనను పెంచడానికి, ఈ సంవత్సరం రాష్ట్రంలో రామనవమి వేడుకలను విస్తృతంగా నిర్వహించాలని కాషాయ బ్రిగేడ్ నిర్ణయించింది.
“ప్రతి బ్లాక్‌లో రామ నవమి వేడుక ఉంటుంది. గ్రామాలు, పట్టణ కేంద్రాల్లో మతపరమైన ఊరేగింపులు తీసుకురాబడతాయి, ”అని విశ్వహిందూ పరిషత్ (VHP) జాతీయ సహాయ కార్యదర్శి, బెంగాల్ ఇన్‌చార్జి సచింద్రనాథ్ సింఘా అన్నారు.
మత హింస
అయితే ఈ వేడుకలకు ఎన్నికలతో ఎలాంటి సంబంధం ఉండదని, ఈ ఏడాది ప్రారంభంలో అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించడం ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకం చేసిందని సింఘా అన్నారు.
బిజెపి తన బ్యానర్‌లో రామ నవమి కార్యక్రమాన్ని నిర్వహించనప్పటికీ, బెంగాల్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల సందర్భంగా వేడుకలలో దాని రాష్ట్ర నాయకులు అధికంగా పాల్గొంటారు.
గత ఏడాది మార్చిలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రామనవమి ఊరేగింపుల సందర్భంగా జరిగిన మత ఘర్షణల్లో ఒకరు మరణించారు. పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు.
ఎన్నికల ప్రభావం
2018లో అప్పటి బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఈ వేడుకను రాష్ట్రంలోని ప్రధాన మతపరమైన కార్యక్రమాలలో ఒకటిగా మార్చినప్పటి నుంచి రామనవమి సందర్భంగా ఇటువంటి ఘర్షణలు రాష్ట్రంలో ఆనవాయితీగా మారాయి. అంతకు ముందు రాష్ట్రంలో రామనవమిని పెద్దగా ఉత్సాహంగా జరుపుకోలేదు.
2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి దాదాపు 40 శాతానికి ఓట్ల శాతం పెరిగింది. అంతకుముందు 2014లో 17 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీ సాధించింది. దీనికి బీజేపీ ప్రధానంగా ఉపయోగించుకున్న నినాదం శ్రీరాముడి పేరును.
మమత కౌంటర్
తృణమూల్ కాంగ్రెస్ త్వరలో బెంగాలీ ఈ జాతీయవాదానికి కౌంటర్ గా స్థానిక సంస్కృతులను హైలెట్ చేయాలని సంకల్పించింది. రాముడి వ్యతిరేకంగా స్థానిక దుర్గా, కాళీ వంటి ప్రసిద్ద హిందూ దేవతలను పూజించాలని సంకల్పించింది.
2021 అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి 2019 లోక్ సభ ఎన్నికల నాటి మ్యాజిక్ ను బీజేపీ ప్రదర్శించలేకపోయింది. దీని తరువాత బీజేపీ రాముడి నినాదాన్ని తీసుకురావడాన్ని చాలామంది నాయకులు ప్రశ్నించారు.
శ్రీరామ్ పరిమితులు
“'జై శ్రీరామ్'ని వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ 'జై మహ కాళి' లేదా 'జై మా దుర్గా' మన బెంగాలీ హృదయాలకు చాలా దగ్గరగా ఉంటుంది. హిందూ భారతదేశంలోని ప్రతి భాగానికి ఓ 'ఇష్ట దేవత' ఉంది. బెంగాల్‌లో కాళి, ఒడిశాలో ప్ర‌భు జ‌గ‌న్నాథ్, అస్సాంలో శంక‌ర్ దేవా అని రాష్ట్ర బీజేపీ సీనియ‌ర్ నేత త‌థాగ‌తా రాయ్ గతేడాది వ్యాఖ్యానించారు.
తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన బిజెపి నాయకులు గత సంవత్సరం గౌహతిలో ఈ రాష్ట్రాల్లో 2024 పార్లమెంటు ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని చర్చించడానికి హడల్‌కి వెళ్ళినప్పుడు బెంగాల్ యూనిట్ ఈ ఆందోళనను హైలైట్ చేసింది.
దుర్గ, కాళి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఈ నెల బెంగాల్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలలో దుర్గ, కాళి మూర్తీభవించిన మాతృశక్తి అంటూ ప్రస్తావించారు. బిజెపి తన హిందూత్వ భావజాలానికి ప్రాంతీయ-సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, హిందూ ఓట్లను ఏకీకృతం చేయడానికి రాముడిని ప్రదర్శించడానికి ఏ అవకాశాన్ని వదులుకోదు.
హిందువులను సంఘటితం చేయడం
గతంలో మాదిరిగానే బెంగాల్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను ఏకం చేయడం ద్వారా రామమందిరం బీజేపీకి మేలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఘోష్ అన్నారు.రాష్ట్ర బీజేపీ నేతలు వీహెచ్‌పీ, హిందూ జాగరణ్ మంచ్ బ్యానర్‌తో తమ ప్రాంతాల్లో రామనవమి కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
“ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్న మూడు నియోజకవర్గాల్లో (అలీపుర్‌దువార్స్, కూచ్ బెహార్, జల్పాయ్ గురి) రామనవమి ఊరేగింపులకు హాజరయ్యేందుకు రాజకీయ నేతలకు ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుందో లేదో మాకు తెలియదు. వేడుకను విజయవంతం చేయడానికి మేము అన్ని విధాలా కృషి చేస్తాము” అని ఉత్తర బెంగాల్‌కు చెందిన ఒక బిజెపి నాయకుడు అన్నారు.
ప్రజా సెలవు
ముఖ్యంగా రాష్ట్రంలోని హిందీ మాట్లాడే వారి ఓట్లను దండుకోవడానికి రామనవమిని ఉపయోగించుకునేందుకు కమల దళం ప్రయత్నించే అవకాశం ఉన్ననేపథ్యంలో టీఎంసీ శ్రీరామనవమికి సెలవు ప్రకటించింది.మమతా బెనర్జీ తన హిందూ వ్యతిరేక ఇమేజ్‌ను రీడీమ్ చేసుకునేందుకే ఈ ప్రకటన చేశారని, అయితే అది “చాలా ఆలస్యం” అని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా పేర్కొన్నారు.
టిఎంసి అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ బిజెపి అవహేళనపై మాట్లాడుతూ “టిఎంసి ఓట్లు పొందడానికి మతాన్ని ఉపయోగించదు. మా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరు కారణంగా ప్రజలు మాకు మద్దతు ఇస్తూనే ఉంటారు. ఈ ఎన్నికల సీజన్‌లో 'జై శ్రీరాం' లేదా ' జై మా దుర్గా' వంటి వాదనలు,ప్రతివాదాల మధ్య, రాష్ట్రంలో రాజకీయాలు మరింత హైందవీకరణ కావడానికి సిద్ధంగా ఉన్నాయి.
Read More
Next Story