సీఏఏ: షరతులు లేని పౌరసత్వం సాధ్యమయ్యేనా?
మథువాలు బీజేపీకి ఎదురుతిరిగారా? సీఏఏ ద్వారా వారికి పౌరసత్వం రావడం గగనం అయిందా? ఇంతవరకు ఒక్క మథువా కూడా ఎందుకు సీఏఏ ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోలేదు
కేంద్ర ప్రభుత్వంలోని మంత్రివర్గంలో ఉన్న శంతను ఠాకూర్ విదేశీయుడా? లేక అక్రమ వలసదారుడా? ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ ప్రశ్నపశ్చిమ బెంగాల్ లో హల్ చల్ చేస్తోంది. కొత్త పౌరసత్వ సవరణ చట్ట ప్రకారం ఆయన కూడా తన పౌరసత్వానికి దరఖాస్తు చేస్తానని ప్రకటించడంతో కొత్త వివాదం ప్రారంభం అయింది. వలస హిందూవులలో ఆందోళన తొలగించడానికి ఈ ప్రశ్న వేసినట్లు కొంతమంది చెబుతున్నా? అనుమానపు చూపులు మాత్రం పోలేదు.
ఠాకూర్ వాదన
పశ్చిమ బెంగాల్ దళిత వర్గానికి చెందిన ప్రధాన కమ్యూనిటీ మథువా. దీని తరఫున అతిపెద్ద నాయకుడిగా ముద్రపడ్డవాడు శంతను ఠాకూర్. ప్రస్తుతం ఈయన ప్రకటనతో బెంగాల్ లోని బీజేపీ తరఫున బంగావ్ స్థానం నుంచి ఆయన నామినేషన్ వేయడాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసే అవకాశం ఉందని న్యాయనిఫుణులు చెబుతున్నారు. మథువాల కోసం బీజేపీ చాలా కష్టపడుతున్నప్పటికీ వారికి పౌరసత్వం ఇచ్చే ప్రక్రియను చాలా క్లిష్టంగా మార్చినందుకు అదే మథువాలు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం కనపడుతోంది.
ఆందోళనలో మథువాలు
బెంగాల్లో సీఏఏ ద్వారా ఒక్క మథువా వ్యక్తి కూడా పౌరసత్వానికి అప్లికేషన్ పెట్టుకోలేదని పలు వర్గాలు ఫెడరల్ కు చెప్పాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓ శరణార్థి సీఏఏ నిబంధనలు నోటిఫై చేసినప్పటి నుంచి ఆందోళన చెంది తరువాత ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమను ఎక్కడ నిర్భంధ శిబిరాలకు తరలిస్తారో అనే ఆందోళనతో ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడని అతడి బంధువులు చెబుతున్నారు.
ఆందోళన చెందుతున్న కేంద్రం
బిజెపితో అనుబంధంతో పెనవేసుకున్న ఆల్ ఇండియా మథువా మహాసంఘం, CAA నిబంధనలను "సరిదిద్దే" వరకు పౌరసత్వం కోసం దరఖాస్తు చేయవద్దని దాని సభ్యులను కోరుతూ ఒక సూచన కూడా జారీ చేసింది. దీనిపై బీజేపీ నాయకులు పలువురు మథువా నాయకులకు ఫోన్ చేసి సీఏఏ నిబంధనల్లో ఏమి తప్పు దొర్లిందో కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ‘బెంగాల్‌కు చెందిన ఎవరూ CAA కింద పౌరసత్వం కోసం ఎందుకు దరఖాస్తు చేసుకోలేదని ఒక సీనియర్ IB అధికారి తెలుసుకోవాలనుకున్నారు’అని కాల్ వచ్చిన ఒక మథువా నాయకుడు ఫెడరల్‌కి చెప్పారు.
రూల్స్ ట్వీకింగ్?
"అధికారితో మాట్లాడుతూ, పౌరసత్వం మంజూరు చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్రం నిబంధనలను సర్దుబాటు చేస్తుందనే నాకు అనిపించింది" అని అతను చెప్పాడు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి ఎన్నికల పర్యటనకు వచ్చిన సందర్భంలో దీనిపై హమీ ఇస్తారని పలువురు బీజేపీ నాయకులు ఫెడరల్ కు చెప్పారు. నాలుగు సంవత్సరాల క్రితం పార్లమెంటు ఆమోదించిన CAAని అమలు చేయడానికి పౌరసత్వ సవరణ నియమాలు, 2024ను హోం మంత్రిత్వ శాఖ మార్చి 11న నోటిఫై చేసింది.
ఎన్నికల ఎత్తుగడ
లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొద్దిరోజుల ముందు కేంద్ర ప్రభుత్వం సీఏఏ రూల్స్ ను నోటిఫై చేసింది. ఇది బెంగాల్ లో గేమ్ చేంజర్ గా మారుతుందని బీజేపీ భావించింది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులుగా భారత్ కు వలసవచ్చిన హిందూ దళిత మథువాలు బెంగాల్లోని నదియా, ఉత్తర 24 పరగణ, తూర్పు బుర్ద్వాన్, మాల్దా జిల్లాలో స్థిరపడ్డారు. వీరంతా తమకు సీఏఏ ద్వారా పౌరసత్వం ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వీరంతా ఓ పార్టీకి ఓటు బ్యాంకుగా కొనసాగుతున్నారు.
రుజువు లేకపోవడం
చాలా మంది సభ్యులు తమను తాము ఎలక్టోరల్ రోల్‌లో చేర్చుకుని, ఆధార్, రేషన్ కార్డ్‌లు, భూమి హక్కు పత్రాలు పొందినప్పటికీ దేశంలో జన్మించనందుకు వారికి పౌరసత్వం ఇవ్వలేదు. ఎందుకంటే వీరంతా నిబంధనల ప్రకారం శరణార్థులు. వారి పౌరసత్వ సందిగ్ధతకు శాశ్వత పరిష్కారంగా బిజెపి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ త్వరలోనే, CAA ద్వారా పౌరసత్వం పొందడం కష్టమని ఈ సమాజం గ్రహించింది.
ఫెడరల్ ఇంతకు ముందు చెప్పినట్లుగా, CAA కింద పౌరసత్వం పొందడానికి, వలసదారుడు మొదట తనను తాను భారతదేశంలో అక్రమంగా స్థిరపడిన వ్యక్తిగా ప్రకటిస్తూ అఫిడవిట్‌ను సమర్పించాలి ఆ తర్వాత అతను లేదా ఆమె ఒకప్పుడు నివాసి చట్టం పేర్కొన్నట్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ వాసినని నిర్ధారించే పత్రాలను సమర్పించాలి. ఇది కొంచె కష్టమైన వ్యవహరం.
చట్టపరమైన చిక్కులు
చాలా మంది వలసదారులు తాము ఒకప్పుడు పైన పేర్కొన్న మూడు దేశాల నివాసితులని నిర్ధారించడానికి ఎటువంటి పత్రాన్ని కలిగి లేరు. ఒక వేళ పౌరసత్వ దరఖాస్తు తిరస్కరణకు గురైతే ఏం చేయాలని, ప్రభుత్వం మమ్మల్ని ఏం చేస్తుంది అనే అనుమానం వారిలో ఉంది. కొత్త నిబంధనలు కూడా దీనిపై ఏం వివరణ ఇవ్వలేదు. కొంతమంది న్యాయనిఫుణుల ప్రకారం వారు దేశం లేని పౌరులుగా మారతారని న్యాయ నిపుణులు అంటున్నారు.
సంఘం భయాలు
"ఒక వ్యక్తి అఫిడవిట్ ద్వారా తనను తాను అక్రమ వలసదారుగా ప్రకటించుకున్న తర్వాత, పౌరసత్వం మంజూరు చేయబడే వరకు, అతను లేదా ఆమె ఓటు హక్కు వంటి భారతీయ పౌరుల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన కొన్ని అర్హతలకు అర్హులు కాదు" అని సీనియర్ న్యాయవాది , ఫారినర్స్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు శిశిర్ డే వివరించారు. ఇటువంటి సంక్లిష్టతలు మథువా సమాజంలోని భయాందోళనలకు దారితీశాయి. విదేశాల నుంచి వచ్చినట్లు కోరే పత్రాలను సమర్పించాలనే నిబంధనలను తొలగించాలని ఆ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మాకు షరతులు లేని పౌరసత్వం కావాలని ముక్తకంఠంతో మథువాలు డిమాండ్ చేస్తున్నారు.
టీఎంసీ లెక్కలు
ఠాకూర్ భారతదేశంలో జన్మించిన భారతీయ జాతీయుడైనప్పటికీ, తాను CAA ప్రకారం పౌరసత్వాన్ని కోరుకుంటానని చెప్పడం ఆ పార్టీ చేస్తున్న రాజకీయ గిమ్మిక్కుగా టీఎంసీ అభివర్ణించింది. మథువాలు చేస్తున్న ఆందోళన వల్ల తమకు ఎదురు దెబ్బ తగులుతుందనే నిరాశను బహిరంగంగా మరో రూపంలో ఠాకూర్ ప్రకటించినట్లయిందని ఆ పార్టీ అభిప్రాయం.
“సిఎఎ పోర్టల్ ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి నేను ఠాకూర్ కు సవాల్ విసురుతున్నాను. అలా చేయాలంటే, అతను మొదట తనను తాను విదేశీ పౌరుడిగా ప్రకటించుకోవాలి. అయితే దీనితరువాత మోదీ తన మంత్రివర్గంలోని విదేశీయుడిని ఎలా అనుమతించాడు అనే ప్రశ్నఉత్పన్నమవుతుంది. ” టీఎంసీ నాయకుడు మమతాబాలా ఠాకూర్ ఎత్తి చూపారు.
ఠాకూర్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే, అతని నామినేషన్‌ను సవాలు చేయవచ్చని లాయర్ చెప్పారు, ఎందుకంటే విదేశీయుడిని ఓటరుగా నమోదు చేయకూడదు, ఎన్నికల్లో పోటీ చేయకూడదు.
Next Story