చిన్నారులపై అత్యాచారం కేసు: బద్లాపూర్ లో ఇంటర్నెట్ నిలిపివేత
x

చిన్నారులపై అత్యాచారం కేసు: బద్లాపూర్ లో ఇంటర్నెట్ నిలిపివేత

పాఠశాల స్వీపర్ అభం, శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడటంతో మహారాష్ట్రలోని బద్లాపూర్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం వెంటనే ఇంటర్నట్ ను..


మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో బుధవారం (ఆగస్టు 21) ఇద్దరు చిన్నారులపై పాఠశాల స్వీపర్ లైంగిక దాడి చేయడంతో భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. దీనితో ప్రభుత్వం హుటాహుటిన ఇంటర్నెట్ సర్వీస్ ను నిలిపి వేసింది. పట్ణణంలో పాఠశాలలను మూసివేస్తూ ఉత్తర్వ్యూలు జారీ చేసింది.

మంగళవారం నిరసనల సందర్భంగా బద్లాపూర్ రైల్వే స్టేషన్, పట్టణంలోని ఇతర ప్రాంతాలలో రాళ్లదాడిలో కనీసం 17 మంది పోలీసులు, ఎనిమిది మంది రైల్వే పోలీసులు గాయపడ్డారు. ఈ హింసకు సంబంధించి కనీసం 72 కారకులు ఉన్నారని ప్రభుత్వం భావిస్తోంది.
బద్లాపూర్‌లో హింస
శాంతిభద్రతల పరిరక్షణ కోసం థానే జిల్లాలోని పట్టణంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. గత వారం వాష్‌రూమ్‌లో స్కూల్ స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడిన తర్వాత వేలాది మంది స్టేషన్‌లో రైల్వే ట్రాక్‌లపై నిరసన వ్యక్తం చేయడం, పాఠశాలపై దాడి చేయడంతో బద్లాపూర్ పట్టణం మంగళవారం ఒక్కసారిగా స్థబ్దుగా మారిపోయింది.
ఆందోళనకారులు పోలీసు సిబ్బందిపై రాళ్లు రువ్వి పాఠశాల భవనాన్ని ధ్వంసం చేశారు. పాఠశాల వద్ద ఆందోళనకారులను చెదరగొట్టడానికి, రైలు ప్రయాణాల కోసం ట్రాక్‌లను క్లియర్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జీ చేశారు.
ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
మహిళలతో సహా కొంతమంది నిరసనకారులు పాఠశాల గేటు, కిటికీ అద్దాలు, బెంచీలు, తలుపులు ధ్వంసం చేశారు. ఈ పాఠశాల బద్లాపూర్‌కు చెందిన బిజెపి నాయకుడి బంధువుకు చెందినదని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. పట్టణంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధాకర్ పఠారే బుధవారం తెలిపారు. సమీక్ష తర్వాత వీటిని పునరుద్ధరిస్తామని చెప్పారు. పట్టణంలోని చాలా పాఠశాలలు బుధవారం మూతపడ్డాయి.
ముగ్గురు పోలీసుల సస్పెండ్
బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో జరిగిన హింసాకాండలో 32 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీస్ కమిషనర్ (జిఆర్‌పి) రవీంద్ర షిస్వే తెలిపారు. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు పాఠశాలలో అటెండర్‌ను ఆగస్టు 17న పోలీసులు అరెస్టు చేశారు.
స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, మహిళా అటెండర్‌ను సస్పెండ్ చేసింది. లైంగిక వేధింపుల విచారణలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్‌తో సహా ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
లైంగిక వేధింపులపై సిట్ విచారణ
ఈ ఘటనపై విచారణకు ఐపీఎస్ అధికారి ఆర్తీ సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్, లైంగిక వేధింపుల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు చేసిన విపరీతమైన జాప్యాన్ని ఖండించారు.
Read More
Next Story