150 ఎల్ ఎల్ వీర్యం, టీఎంసీ మంత్రి కొడుకు.. ఇందులో ఏదీ నిజం?
x

150 ఎల్ ఎల్ వీర్యం, టీఎంసీ మంత్రి కొడుకు.. ఇందులో ఏదీ నిజం?

అదిగో పులి.. ఇదిగో తోక అంటే విన్నారుగా.. అలా ఉంది సోషల్ మీడియా లో షేర్ అవుతున్న కొన్ని కథనాలు. కోల్ కతలోని వైద్యురాలి హత్య, అత్యాచారం పై తప్పుడు కథనాలు వైరల్..


దేశాన్ని కుదిపేస్తున్న కోల్ కత వైద్యురాలి హత్య, అత్యాచారం కేసుపై సోషల్ మీడియాలో వ్యాప్తి అవుతున్న తప్పుడు సమాచారం పై బెంగాల్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దర్యాప్తు పక్కదారి పట్టిందని, అనవసర వివాదాలు, సమాచారాలు ఈ కేసుకు అంటగడుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఇలాగే తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న ఓ ఆడియో క్లిప్ ను సోషల్ మీడియా నుంచి పోలీసులు తొలగించారు. అందులో ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా ఆర్ జీ కర్ ఆస్పత్రిలో ఏడు.. ఎనిమిది మంది ఇంటర్న్ షిప్ లు ఈ హత్యలో పాల్గొన్నారని . ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ హత్య తరువాత అత్యాచారం పాల్పడ్డాడని వాయిస్ లో పేర్కొంది. అయితే ఈ వాయిస్ క్లిప్ లో కేవలం ఒక్కరి వాయిస్ మాత్రమే ఉంది. ఆమె మరొక వ్యక్తితో మాట్లాడుతున్నట్లు నటించింది. ఈ పోస్ట్‌ను ఫేస్‌బుక్‌లో వేలాది మంది లైక్ చేసి షేర్ చేశారు.
అదే పంథాలో, ఇతర సోషల్ మీడియా వినియోగదారులు చాలా మంది వ్యక్తులు మహిళపై అత్యాచారం చేశారంటూ పోస్ట్‌లను షేర్ చేశారు. పెద్ద సంఖ్యలో కోల్‌కతా వాసులు వీటిని నిజమని విశ్వసిస్తున్నప్పటికీ, వీటికి సాక్ష్యాలు మాత్రం ఇప్పటికే దొరకలేదు. వీటిపై ప్రజలకు నిజాలు చెప్పేందుకు ఎంపీ మహువా మొయిత్రా.. కోల్ కత పోలీసులు రంగంలోకి దిగారు.
1. TMC మంత్రి కుమారుడి ప్రమేయం
ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ఇంటర్న్ గా "మంత్రి సౌమెన్ మహాపాత్ర కుమారుడు" సుభాదీప్ సింగ్ మహాపాత్ర ఉన్నాడు. అందుకే ఆస్పత్రిని బెంగాల్ ప్రభుత్వం రక్షిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. మొదటిది, సుభాదీప్ సింగ్ మహాపాత్ర సౌమెన్ మహాపాత్ర కుమారుడు కాదు.
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తన కొడుకు పేరు బోధిసత్వ మహాపాత్ర అని, అతను ప్రస్తుతం మిడ్నాపూర్ ఈస్ట్‌లోని పన్స్‌కురాలో బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (BMOH) గా ఉన్నాడని కొన్ని రోజుల క్రితం మీడియాకు స్పష్టం చేశారు. అతనికి RG కర్ హాస్పిటల్‌తో ఎలాంటి సంబంధం లేదు.
అతను 2017లో SSKM హాస్పిటల్‌లో ఇంటర్న్ అయ్యాడు. నేరం జరిగినప్పుడు అతను తన గర్భవతి అయిన భార్యతో కలిసి అపోలో హాస్పిటల్స్‌లో ఉన్నాడని అతని తల్లి సుమన కూడా ప్రెస్‌కు వివరించింది.

2. శవపరీక్షలో 150 మిల్లీ లీటర్ల వీర్యం..
ఓ వైద్యుడి అభిప్రాయాన్ని కోట్ చేస్తూ.. ఒక ప్రముఖ మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. బాధితురాలి జననాంగల్లో 151 మిల్లి గ్రాముల వీర్యం ఉన్నట్లు తెలిపింది. దీనిని బట్టి ఇది కేవలం ఒక్కరిది కాదని, గ్యాంగ్ రేపుకు గురైందని తెలిపింది.
అయితే ఇది నిజానికి 150 gm ని, 150 mgకి మార్చినట్లు తేలింది. మహిళ తల్లిదండ్రులు, కలకత్తా హైకోర్టులో తమ ఫిర్యాదులో, మహిళ శరీరంలోని వీర్యం మొత్తంగా “150 mg” అని పేర్కొన్నారని, ఇది ఒక వ్యక్తి కాదని వారు పేర్కొన్నారు.
TMC MP మహువా మొయిత్రా సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్‌లో “150 గ్రాముల వీర్యం”పై ఉన్న అపోహలను ఛేదించారు. ముందుగా, వీర్యం వంటి ఏదైనా ద్రవాన్ని మిల్లీలీటర్లలో (ml) కొలుస్తారు. గ్రామ్ లేదా మిల్లీగ్రాము (mg) లో కాదు అని ఆమె స్పష్టం చేసింది. రెండవది శవపరీక్షలో పేర్కొన్న “150 గ్రాముల” సంఖ్య స్త్రీ, అంతర్గత, బాహ్య జననేంద్రియాల బరువు అని పేర్కొంది. శవపరీక్ష నివేదిక అంత నకిలీ అని కూడా పేర్కొన్నారు.
మొత్తం ప్రక్రియను వీడియోగ్రాఫ్ చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, ముగ్గురు వైద్యులు సాక్షులు, మహిళ కుటుంబం సమక్షంలో నిర్వహించామని మోయిత్రా స్పష్టం చేశారు. " దీనిని తారుమారు చేయడం సాధ్యం కాదు," ఆమె చెప్పింది.
3. స్త్రీ "కటి వలయము" లేదా "కటి ఎముక" "విరిగినది"
వైద్యురాలి మరణం తర్వాత తల్లిదండ్రులతో పాటు ఆసుపత్రికి వెళ్లి ఓ వైద్యుడి కుటుంబం మీడియాకు ఓ విషయం చెప్పారు. మహిళ కాళ్లు 90 డిగ్రిల కోణంలో ఉన్నాయని, ఆమె కటివలయం విరిగిపోయిందని చెప్పారు. ఇది తరువాత వైరల్ గా మారింది. అయితే శవ పరీక్షలో మాత్రం బాధితురాలి శరీరంలో ఎటువంటి పగళ్లు ఉన్నట్లు చెప్పలేదు.
నాలుగు పేజీల నివేదికలో బాధితురాలిని ఉక్కిరిబిక్కిరి చేసి చనిపోయే ముందు ఆమె థైరాయిడ్ మృదులాస్థి విరిగిపోయిందని పేర్కొంది. ఆమె బొడ్డు, పెదవులు, వేళ్లు, ఎడమ కాలికి గాయాలయ్యాయి. ఆమె నోరు కప్పబడి ఉంది. ఆమె తలను గోడకు లేదా నేలకి కొట్టారు. ఆమె అరుపులను ఆపడానికి నోరు, గొంతును నిరంతరం బలంగా నొక్కి ఉంచారు.
ఆమె కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తం కారుతోంది. "వికృత లైంగికత", "జననేంద్రియ హింస" కారణంగా ఆమె ప్రైవేట్ భాగాలలో లోతైన గాయం అయింది. కానీ ఎలాంటి ఫ్రాక్చర్ గురించి ప్రస్తావించలేదు.

4. పోలీసులు.. ఆత్మహత్య గా కేసు నమోదు..
మహిళ ఆత్మహత్య గురించి కుటుంబ సభ్యులకు చెప్పలేదని కోల్‌కతా పోలీసులు స్పష్టం చేశారు. దీన్ని ఆసుపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ చేశారు. రెండవది, అసహజ మరణం కేసును నమోదు చేయడం సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం అని పోలీసులు కూడా కొట్టిపారేశారు. కోల్‌కతా పోలీస్ చీఫ్ వినీత్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. అసహజ మరణానికి సంబంధించిన కేసు ఎప్పుడూ నమోదు చేయబడుతుంది. అధికారికంగా ఫిర్యాదు చేసి, శవపరీక్ష నివేదిక అందిన తర్వాత, అసహజ మరణ కేసులను హత్య దర్యాప్తుగా మార్చవచ్చుని వివరించారు. ఈ ప్రక్రియ BNSS, గతంలో CrPCలో చెప్పారు.

5. క్రైమ్ సీన్ సీల్ చేయలేదు.. కేసు తారుమారు..
ఆగస్టు 9న యువ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన సెమినార్ గదిని మరమ్మతుల పేరుతో కూల్చివేశారనే ఆరోపణలు ఉన్నాయి. నేరం జరిగిన ప్రదేశం సురక్షితంగా ఉందని, ఆసుపత్రిలో వేరే మరమ్మతులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కలకత్తా హైకోర్టుకు తెలిపింది.
మహువా మొయిత్రా కూడా వీడియోలో నేరం జరిగిన ప్రదేశం లేదా సంఘటన జరిగిన ప్రదేశం (PO) "నేరం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు మూసివేశారు" అని పేర్కొన్నారు. ఇప్పుడు, కోల్‌కతా పోలీసులు, CBI మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలరని పేర్కొంది.
Read More
Next Story