‘‘ముందు మీ దేశంలో జరుగుతున్న వాటిని చక్కదిద్దుకోండి’’
x

‘‘ముందు మీ దేశంలో జరుగుతున్న వాటిని చక్కదిద్దుకోండి’’

బంగ్లాకు కౌంటర్ ఇచ్చిన భారత విదేశాంగ శాఖ, బెంగాల్ హింసపై వ్యాఖ్యలు చేసిన తాత్కాలిక ప్రభుత్వం


పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో వక్ఫ్ ఆందోళనల పేరిట హిందువులపై దాడి చేసిన అంశంపై బంగ్లాదేశ్- భారత్ మధ్య మాటల యుద్దానికి దారితీసింది.

భారత్ లో జరిగిన హింసను బంగ్లాదేశ్ ఖండించడంపై విదేశాంగ శాఖ తీవ్రంగా మందలించింది. ఢాకా చేస్తున్నవి అనవసర వ్యాఖ్యలు అని ఘాటుగా విమర్శలు గుప్పించింది.
విదేశాంగశాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో మాట్లాడుతూ... ఈ మాటలు భారత్, బంగ్లాదేశ్ ఒక్కటే అని చెప్పడానికి వాడుతున్నారని, ఇదో మోసపూరిత ప్రయత్నం అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అక్కడ నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతారని చురకలంటించారు.
‘‘పశ్చిమ బెంగాల్ లో జరిగిన సంఘటలకు సంబంధించి బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలను మేము తిరస్కరిస్తున్నాముం. బంగ్లాలో మైనారిటీలపై కొనసాగుతున్న వేధింపులపై భారత్ ఆందోళనలతో సమాంతరంగా చూపించడానికి ఇది కేవలం ఓ కపట ప్రయత్నం. అక్కడ ఇటువంటి చర్యలకు పాల్పడే నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు’’ అని జైస్వాల్ అన్నారు.
‘‘అనవసర వ్యాఖ్యలు చేయడం కంటే బంగ్లాదేశ్ తన సొంత మైనారిటీల హక్కులను పరిరక్షించుకోవడం పై దృష్టి పెట్టాడం మంచిది’’ అని ఎంఈఏ ఒక పోస్ట్ లో బంగ్లాకు హితవు పలికింది.

గొడవకు దారి తీసిందేమిటీ?
బెంగాల్ లో జరిగిన హింసలో బంగ్లాదేశీయుల ప్రమేయం లేదని ఖండించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహదారు యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం.. ముస్లింలపై జరిగిన దాడిని ఖండించారు. ఈ గొడవల ఫలితంగా గణనీయమైన ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిసింది. మైనారిటీ ముస్లిం జనాభా భద్రత,రక్షణను నిర్ధారించడానికి భారత్ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ అధికారులు అవసరమైన చర్య తీసుకోవాలని కోరారు. దీని పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ముర్షిదాబాద్ హింసపై హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి చొరబడిన కొంతమంది మతోన్మాదుల ప్రమేయం ఉందని తేలింది.
ఇదిలా ఉండగా జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం శుక్రవారం పశ్చిమ బెంగాల్ లోని మాల్దాకు చేరుకుందని జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది. ఈ నెల ప్రారంభంలో రాష్ట్రంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల నేపథ్యంలో హింసాకాండకు గురైన ముర్షిదాబాద్, మాల్డా ప్రాంతాలకు ఈ బృందం సందర్శించనుంది.
Read More
Next Story