మమతా వ్యాఖ్యలపై గవర్నర్ కు ఎందుకంత కోపం...
x

మమతా వ్యాఖ్యలపై గవర్నర్ కు ఎందుకంత కోపం...

బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారికి ఆశ్రయం కల్పించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై గవర్నర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


బంగ్లాదేశ్ లో జరుగుతున్న రిజర్వేషన్ ఉద్యమం వల్ల నిస్సహాయులైన బంగ్లాదేశీలకు పశ్చిమ బెంగాల్ లో ఆశ్రయం కల్పించాలని ప్రతిపాదించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం కోల్‌కతాలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ వార్షిక అమరవీరుల దినోత్సవ ర్యాలీలో సీఎం మాట్లాడారు. బంగ్లాదేశ్ సార్వభౌమాధికార దేశమైనందును ఈ వ్యవహరాలపై మాట్లాడటం తగదు అని అంటూ... ఈ విషయం పై ఏం మాట్లాడలన్నది కేంద్రానికి సంబంధించిన అంశం. కానీ నేను మీకు ఓ విషయం చెప్పదలుచుకుంటున్నాను. నిస్సహాయ వ్యక్తులు మా తలుపు తట్టినట్లు అయితే మేము వారికి ఆశ్రయం కల్పిస్తాం అని మమతా బెనర్జీ అన్నారు.
గవర్నర్‌ అభ్యంతరం
మమతా బెనర్జీ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. గవర్నర్ కూడా ఆక్షేపించారు. ఇది తీవ్ర స్వభావం గల రాజ్యాంగ ఉల్లంఘనగా ఆయన వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో ఉద్యోగాల కోటాల విషయంలో హింస చెలరేగడంతో ఆ దేశంలో ఉన్న వందలాది మంది భారతీయ విద్యార్థులు భారత్‌కు వచ్చేశారు.
మమత వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమం ఎక్స్‌ లో రాజ్ భవన్ మీడియా సెల్ వ్యవహరాలను చూసే విభాగం పోస్ట్ చేశారు. ఈ విషయంలో కేవలం కేంద్రానికి మాత్రమే అధికారం ఉందని అన్నారు.
కేంద్రం-వర్సెస్-బెంగాల్
"విదేశీ దేశం నుంచి వచ్చే వ్యక్తులకు వసతి కల్పించే విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. విదేశీ దేశం నుంచి వచ్చే వ్యక్తులకు ఆశ్రయం కల్పించే బాధ్యతను ఒక ముఖ్యమంత్రి తీసుకుంటాం అనే బహిరంగ ప్రకటన రాజ్యాంగ ఉల్లంఘనను సూచిస్తుంది. ఇది తీవ్రమైన నేర స్వభావం,” అని తెలిపింది.
“రాజ్యాంగ సంబంధమైన హక్కులను విస్మరించి” అటువంటి ప్రకటనకు గల ప్రాతిపదికను వివరిస్తూ సమగ్ర నివేదికను అందజేయాలని ముఖ్యమంత్రిని గవర్నర్ ఆదేశించినట్లు అది పేర్కొంది. దేశంలోకి ఊహించిన వలసలు బెంగాల్‌లోని సరిహద్దు ప్రాంతాలలో సాధారణ జీవనంపై ప్రభావం చూపకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
Read More
Next Story