బెంగాల్ ‘ఎస్ఐఆర్’ కు గవర్నర్ మద్దతు
x
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్

బెంగాల్ ‘ఎస్ఐఆర్’ కు గవర్నర్ మద్దతు

ఆగ్రహం వ్యక్తం చేసిన టీఎంసీ


ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నా ‘ఎస్ఐఆర్’ ను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ సమర్థించారు. దేశంలో ఎన్నికల జాబితాను ఈ ప్రక్రియ అవసరమని అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్దరించడానికి, వ్యత్యాసాలను తొలగించడానికి ఈ ప్రక్రియ రూపొందించారని, బీహార్ ఎన్నికల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) సమర్థవంతంగా పనిచేశాయని, ఇవి ప్రజల ఆమోదం పొందిందని బోస్ అన్నారు.

‘‘ప్రజల గందరగోళంలో ఉంటే, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా, స్వేచ్ఛగా, నిష్ఫాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూసుకోవడానికి ఎస్ఐఆర్ ఉత్తమ ప్రక్రియ అని మనం వారిని ఒప్పించాలి’’ అని బోస్ కోల్ కతలో విలేకరులతో అన్నారు.

‘‘బీహార్ దానిని నిరూపించింది. బెంగాల్ ప్రజలు కూడా దీనిని అంగీకరిస్తారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను’’ అని ఆయన అన్నారు. ఎన్నికల విశ్వసనీయతను బలోపేతం చేయడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ సవరణ డ్రైవ్ జరిగిందని అన్నారు.

ఎన్నికలకు ముందు హింస, అవినీతి నిర్మూలించాలని బోస్ అన్నారు. లేకపోతే రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్ఫాక్షికంగా ఎన్నికలు జరగవని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోందని బోస్ అన్నారు. బెంగాల్ లో ఎన్నికలు బుల్లెట్ ఆధారంగా కాకుండా బ్యాలెట్ ఆధారంగా జరగాలని ఆకాంక్షించారు.

కళ్యాణ్ బెనర్జీ ఎదురు దాడి..
గవర్నర్ వ్యాఖ్యలపై టీఎంసీ స్పందించింది. ఆ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ నేరస్థులకు ఆశ్రయం కల్పించారని, బాంబులు, తుపాకులతో ఆయుధాలు సమకూర్చారని ఆయన ఆరోపించారు.
‘‘ముందుగా రాజ్ భవన్ లో నేరస్థులకు ఆశ్రయం కల్పించవద్దని గవర్నర్ కు చెప్పండి’’ అని బెనర్జీ విలేకరులతో అన్నారు. ‘‘అతను(గవర్నర్) నేరస్థులకు రాజ్ భవన్ లో ఉంచి, వారికి తుపాకులు, బాంబులు ఇచ్చి తృణమూల్ కార్యకర్తలపై దాడి చేయమని చెబుతున్నాడు.
ముందుగా దీన్ని ఆపనివ్వండి’’ అని బెనర్జీ ఆరోపించారు. గవర్నర్ బీజేపీ సేవకుడిగా పనిచేస్తున్నారని, ఆయన ఉన్నంత కాలం పశ్చిమ బెంగాల్ కు మంచి జరగదని అన్నారు. ఈ ఆరోపణలపై రాజ్ భవన్ స్పందించింది. పౌరులు, విలేకరులు వచ్చి రాజ్ భవన్ ను తనిఖీ చేసుకోవచ్చని ఆహ్వానించింది.
ఆధారాలు చూపండి..
రాజ్ భవన్ లో ఆయుధాలు నిల్వ చేయబడ్డాయో లేదో ధృవీకరించడానికి సీఎం మమతా బెనర్జీ వందమంది పౌరులు, విలేకరులు వచ్చి ఆదివారం ఉదయం 5 గంటల నుంచి తనిఖీ చేసుకోవచ్చని, అక్కడ రాజ్ భవన్ ద్వారాలు తెరిచి ఉంచుతామని అన్నారు.
కోల్ కతా పోలీసులే ప్రాంగణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నందున ఇంత హై సెక్యూరిటీ జోన్ లోకి ఆయుధాలు ఎలా ప్రవేశించాయనే దానిపై తక్షణ విచారణ జరపాలని రాజ్ భవన్ పేర్కొంది. ఈ అంశంపై లోక్ స్పీకర్ పై ఫిర్యాదు చేస్తామని కూడా రాజ్ భవన్ కార్యాలయం పేర్కొంది.
Read More
Next Story