ఆయనే ఒడిశా నెక్ట్‌ సీఎం ?
x
మహిళలతో పాండియన్

ఆయనే ఒడిశా నెక్ట్‌ సీఎం ?

ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తర్వాత ఆ పీఠాన్ని ఓ ఐఏఎస్‌ అధికారి అధిరోహిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.


ఒడిశా నెక్ట్స్‌ సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తర్వాత ఆ పీఠాన్ని ఓ ఐఏఎస్‌ అధికారి అధిరోహిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తర్వాత ఆ పీఠాన్ని ఓ ఐఏఎస్‌ అధికారి అధిరోహిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. పట్నాయక్‌ పాలనలో అత్యంత కీలకంగా వ్యవహరించి, ‘మోస్టు ఎఫీసియంట్‌గా వర్సన్‌’గా పేరు తెచ్చుకున్నారు వీ కార్తికేయన్‌ పాండియన్‌్‌.ఇటీవల (అక్టోబర్‌ 23న) ఆయన తన ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో ఆయన ఇక రాజకీయాల్లోకి వస్తాయన్న ఊహాగానాల నడుమ పాండియన్‌కు కొందరు అధికార పార్టీ మంత్రులు అభినందనలు తెలపడమే అందుకు కారణం.
సరిగ్గా ఇదే సమయంలోనే ఒడిశాలోని అధికార జనతా దళ్‌ (బీజేడీ) ఐటీ విభాగం ఇటీవల ఓ పోస్టర్‌ను ట్వీట్‌ చేసింది. విరాట్‌ కోహ్లీ, వీ కార్తికేయన్‌ పాండియన్‌ను ఒకే పోస్టర్‌లో చూపుతూ ‘‘అన్‌స్టాపబుల్‌’’ క్యాప్షన్‌తో ఉన్న ఈ పోస్టర్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది.
అసలు ఎవరీ పాండియన్‌..
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రైవేట్‌ సెక్రటరీ పాండియన్‌. 2000 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఇతను ఓ తమిళియన్‌. 2002-2004 ఒడిషాలోని కలహండిలో సబ్‌ కలెక్టర్‌గా, 2005-2007 మయూర్‌భంజ్‌లో కలెక్టర్‌గా, 2007 - 2011 గంజాంలో కలెక్టర్‌గా, 2011లో ఒడిశా సీఎం ప్రైవేట్‌ సెక్రటరీగా పనిచేశారు. కొంతకాలానికి ఒడిషా 5టి అధికారిగా విధులు నిర్వహించారు. ఒడిషాలోని ఒడియా అమ్మాయిని వివాహమాడారు. భార్య పేరు సుజాత. ఐఎఎస్‌ అధికారి అయిన ఈమె ఒడిశా మిషన్‌ శక్తి కార్యదర్శిగా ఉన్నారు.
పాండియన్‌కు అవార్డులు..
పాండియన్‌ బాధ్యతాయుతంగా పనిచేయడం వల్ల ఆయన్ను ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయన పలు అవార్డులను అందుకున్నారు. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ ద్వారా హెలెన్‌ కెల్లన్‌, వికలాంగుల సంక్షేమం కోసం నేషన్‌ అవార్డు, ఇంటర్నేషనల్‌ హాకీ ఫెడరేషన్‌ ద్వారా ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్‌ అవార్డును పాండియన్‌ అందుకున్నారు.
పాండియన్‌పై ఫిర్యాదు..
2019లో ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపటిన పట్నాయక్‌ పాండియన్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. 5టీకి చైర్మన్‌ను చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో ఒడిషాలోని 30 జిల్లాలను పాండియన్‌ ప్రభుత్వ హెలికాప్టర్‌లో పర్యటించడం దుమారాన్ని లేపింది. ప్రతిపక్ష నాయకులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అధికార పార్టీ ర్యాలీగా అభివర్ణించారు. బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి పాండియన్‌ తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆల్‌ ఇండియా సర్వీస్‌ రూల్స్‌ను అతిక్రమిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో పాండియన్‌ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర లేదని కాంగ్రెస్‌ ఎంపీ సప్తగిరి కామెంట్‌ చేశారు.
ప్రశంశల వెల్లువ..
సీఎం నవీన్‌ పట్నాయక్‌ సమర్ధవంతమైన పాలన వెనక వీకే పాండియన్‌ ఉన్నారన్నది జనం మాట. కొన్ని ముఖ్యమైన పనులకు సీఎం హాజరుకాలేని పక్షంలో వాటికి పాండియన్‌ హాజరయ్యేవారట. సీఎంకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన పాండియన్‌ను అధికార బిజూ జనతా దళ్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు. ఇతను అందరికంటే భిన్నంగా రాష్ట్ర రూపురేఖలు మారుస్తారన్న వారు భావిస్తున్నారు. పాండియన్‌పై బీజేడీ నాయకులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఆయనకు అభినందనలు తెలిపేందుకు ప్రభుత్వ అధికారులు, స్టేట్స్‌ బ్యూరోక్రాట్స్‌, పోలీసు అధికారులు క్యూ కడుతున్నారు. పాండియన్‌ను కలిసి ఫోటోలు దిగేందుకు పోటీపడుతున్నారు. ఒడిషా ఏకలవ్య రెసిడెన్షియల్‌ మోడల్‌ స్కూల్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌, ఒడిషా బాప్టిస్ట్‌ చర్చి అసోసియేషన్‌, ఒడిషా డ్రగ్‌ కంట్రోల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ పాండియన్‌ను ఆహ్వానించాయి కూడా. భువనేశ్వర్‌ నుంచి వెలువడే ‘ఇండియా ఫస్ట్‌‘ అనే పత్రిక తన కవర్‌ పేజీపై సరైన స్థలం, సరైన సమయం..అని ముద్రిస్తూ.. ‘మాజీ బ్యూరోక్రాట్‌ పాండియన్‌ పబ్లిక్‌ సర్వెంట్‌గా ఎదగడం.. ఒడిశా ప్రయోజనాలకు కోసం’ అని పేర్కొంది.
పాండియనే సమర్థుడు ..
అధికార పార్టీ నేతల నుంచి పాండియన్‌కు పొగడ్తలు వెలువెత్తుతున్నాయి. ‘‘రాష్ట్రాన్ని పాండియన్‌ అభివృద్ధి పథంలో నడిపిస్తారని భావిస్తున్నాను. ఆయన నేతృత్వంలో 2036 నాటికి భారతదేశంలో ఒడిశా ఉత్తమ రాష్ట్రంగా నిలుస్తుంది.’’ అంటూ బీజేడీ ఎంపీ డా. అమర్‌ పట్నాయక్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
‘‘పాండియన్‌ను కలిసి మాట్లాడడం ఓ మంచి అనుభూతి అని ఎంపీ సస్మిన్‌ పేర్కొన్నారు. ఒడిశా ప్రజలంటే ఎంతో ప్రేమ ఉన్న పాండియన్‌..దృఢ సంకల్పం, నిబద్ధతతో నవీన ఒడిశాను నిర్మించగలడన్న విశ్వాసాన్ని సస్మిన్‌ వ్యక్తం చేశారు.
బీజేపీ ఆర్గనైజేషన్‌ సెక్రటరీ ప్రణబ్‌ ప్రకాష్‌ దాస్‌తో సహా మరికొందరు పాండియన్‌ను నవీన్‌ పట్నాయక్‌ ‘నిజమైన శిష్యుడు’గా అభివర్ణించాడు. రాజకీయ నాయకుడు దేబీ ప్రసాద్‌ మిశ్రా ఓ సమావేశంలో ‘‘పాండియన్‌ మా ముఖ్యమంత్రి’’ అని నోరు జారారు. తరువాత దానికి సంజాయిషీ ఇచ్చారు. తప్పు దొర్లిందని వివరణ ఇచ్చుకున్నారు.
నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వంలో 16 మంది క్యాబినెట్‌ మంత్రులు ఉన్నారు. అయితే మాజీ ప్రైవేట్‌ సెక్రటరీ పాండియన్‌పై కురిపిస్తున్న ప్రశంసలకు వారెవరూ దగ్గరగా లేరు. పాండియన్‌ ఇంకా అధికారికంగా బీజేడీలో చేరలేదు. చేరతాడనే టాక్‌ ఉంది. అతను పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేపడతాడని జనం భావిస్తున్నారు.
Read More
Next Story