ఒడిశా: మోదీ వ్యతిరేక పాత్ర ఎంత వరకూ ఉపయోగపడుతుంది
x

ఒడిశా: మోదీ వ్యతిరేక పాత్ర ఎంత వరకూ ఉపయోగపడుతుంది

ఒడిశాలో బీజేడీ తన పై పడిన ముద్రను తొలగించుకునే ప్రయత్నాలు చేస్తోంది. రాజ్యసభలో ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో బీజేడీ సభ్యులు వాకౌట్ చేసి చేశారు.


ఒడిశా మాజీ సీఎం నవీన పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ క్రమక్రమంగా బీజేపీకి దూరం జరుగుతున్నట్లు సంకేతాలు ఇస్తోంది. వారి మధ్య దశాబ్దాల అనుబంధం ఉంది. అయితే ఆయన 24 సంవత్సరాల పాలనను బీజేపీ గత సార్వత్రిక ఎన్నికల్లో తెరదించింది.

ఈ మధ్య బీజేడీ ఎంపీలు రాజ్యసభ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చేస్తున్న సమయంలో వాకౌట్ చేసి ప్రతిపక్షంలో చేరారు. ఈ పార్టీకి తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. ఇది చాలా అసాధారణ దృశ్యం అని చెప్పవచ్చు. ఇన్ని పార్టీతో రహస్యంగా రాసుకుని తిరిగిన స్నేహానికి ఇక మంగళం తప్పదని బీజేపీ భావిస్తోంది.
దగ్గర.. దూరంగా..
BJD 1997లో స్థాపించబడినప్పుడు BJP నే దానిని ప్రోత్సహించింది. అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించింది. BJDకి BJPతో సుదీర్ఘమైన చెక్కుచెదరని అనుబంధం ఉంది. గత నెలలో ముగిసిన BJD 24 ఏళ్ల పాలనలో మొదటి తొమ్మిదేళ్ల పాటు, ఇద్దరూ ఒడిశాను కూటమిగా పాలించారు. విడిపోయాక అధికారికంగా రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా - ముఖ్యంగా 2019 నుంచి - ఇద్దరూ శత్రువుల కంటే ఎక్కువగా స్నేహితులుగా ఉన్నారు.
రాష్ట్రంలో బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, బిజెడి అనేక సందర్భాల్లో బిజెపికి మద్దతు ఇచ్చింది. మోదీపై అవిశ్వాస తీర్మానం లేదా ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ సర్వీసెస్ వంటి అంశాలు పార్లమెంట్ లో దానికి అనుకూలంగా ఓటు వేసింది.
బీజేపీ బీ టీమ్ కాదా?
గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన పట్నాయక్ తిరిగి పార్టీని సరైన పథంలోకి నడిపిస్తున్నాడనే చెప్పవచ్చు. బీజేపీకి లొంగిపోయిందని పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. దీన్ని తొలగించడానికి నవీన్ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాడని అర్థమవుతోంది. తాము ఎంతమాత్రం బీజేపీకీ బీ టీం కాదని ఇప్పుడు ప్రజలకు సందేశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉంది. కానీ అది అంత తేలికైన పని కాదు. కానీ ఒడిశా ప్రజలు దీనిని ఎలా రీసీవ్ చేసుకుంటారో ఇప్పుడే చెప్పలేం.
భవిష్యత్తు ఏంటీ?
పట్నాయక్ బీజేపీని ఎందుకు వదులుకున్నారో, ప్రతిపక్షంతో పోటీ పడాలని నిర్ణయించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆయనకు 77 ఏళ్ల వయస్సు ఉన్నారు. ఆరోగ్యం బాగాలేదు. ఒడిశాలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన పట్నాయక్ చాలా అనిశ్చిత రాజకీయ భవిష్యత్తును ఎదుర్కొంటున్నారు. తదుపరి ఎన్నికలు 2029లో జరగనున్నాయి, ఆ సమయంలో పట్నాయక్‌కు 82 ఏళ్లు వస్తాయి. ఆయన రాజకీయంగా ఇంకా కోలుకుంటాడన్న ఆశ లేదు.
ఆయన పార్టీకి భవిష్యత్తు కూడా అంత అనిశ్చితంగానే కనిపిస్తోంది. పార్టీ అధికారంలో లేదు. రెండవ స్థాయి నాయకత్వం లేదు.(పార్టీలో ఎవరూ సవాలు చేసేవారు ఎదగకుండా పట్నాయక్ జాగ్రత్తలు తీసుకున్నారు), BJD నాయకత్వం.. గుర్తింపు సంక్షోభం రెండింటినీ ఎదుర్కొంటుంది. పట్నాయక్ అనంతర కాలంలో ఏమి జరుగుతుందో, ఎవరు నాయకత్వం వహిస్తారో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు.
బిజెపితో బిజెడి చేతులు కలిపి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను రెండు నెలల క్రితం రాజ్యసభకు పంపారు. బీజేపీకి అసెంబ్లీలో సరైన సంఖ్య లేనప్పటికీ బీజేడీ సాయం చేసింది. ఇది పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. బిజెపికి బీజేడీ ఇచ్చిన ఎల్లలు లేని మద్ధతు ప్రజల్లో అనేక అనుమానాలకు తావిచ్చింది. అనేక చిన్న చిన్న రాజకీయ ప్రయోజనాల కోసం నవీన్ పట్నాయక్ ఇలా చేస్తున్నారని ఒడియాలు విశ్వసించారు.
పార్లమెంట్ లో ప్రతిపక్షం వైపు నిలబడటం, వాకౌట్ చేయడం అనేది ప్రజల్లో మరింత చులకనగా కాకుండా చూసుకోవడమే అనే అభిప్రాయం వినిపిస్తోంది. తన ఉనికి కోసం బీజేడీ చేస్తున్న ఆఖరి ప్రయత్నం ఇది.
ఇప్పుడు ఒడిశాలో బిజెపి అధికారాన్ని చేజిక్కించుకుంది, పట్నాయక్.. ఆయన పార్టీ బిజెడి నిజమైన ప్రతిపక్షంగా తమ విశ్వసనీయతను సుస్థిరం చేసుకోవడం భవిష్యత్ ప్రణాళికలను రచిస్తున్నారని అర్థం. BJD కూడా సమీప భవిష్యత్తులో ప్రతిపక్ష స్థానాన్ని పటిష్టం చేయడం కోసం రాష్ట్రంలో మూడో పార్టీ అయిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు. బీజేపీ కొనసాగించే వేటను తట్టుకుని, తన నాయకులను కాపాడుకోవడం ఈ వయస్సులో చాలా కష్టమైన పనే.
ఇప్పటి నుంచి ఐదు లేదా 10 సంవత్సరాలలో BJDకి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై పార్టీలో జరుగుతున్న చర్చలు, పెరుగుతున్న భయాందోళనలను అతను ఎలా పరిష్కరిస్తాడో కూడా చూడాలి. ఇందుకోసం ఎలాంటి నైపుణ్యం ఉండే నాయకుడిని ఎన్నుకుంటాడోచూడాలి.
స్నేహితుడా లేక శత్రువా?
ఇంతకుముందు తన పార్టీ వారసుడిగా ఐఏఎస్ అయిన వీకే పాండియన్ ను అనధికారికంగా ప్రకటించారు. ఆయనే పార్టీ వ్యవహరాలు చూసుకునే వాడు. కానీ ఇది తరువాత కాలంలో బెడిసికొట్టింది. మరోకసారి ఇలాంటి పొరపాటు జరిగితే బీజేడీ చీలికకు దారి తీయవచ్చు. కాబట్టి నవీన్ ఆచితూచి అడుగువేయాలి. కానీ బీజేపీ నుంచి ప్రజలను తిరిగి బీజేడీ వైపు మళ్లించడం అతి కష్టమైన పని. సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ బీజేపీ- బీజేడీ పొత్తు కోసం ప్రయత్నాలు చేశాయి. కానీ చివరి నిమిషంలో అది రద్దు అయింది. చివరకు బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.పట్నాయక్ పార్టీ విశ్వసనీయత లేమితో బాధపడుతోందన్న విషయం చాలా బలంగా వినిపిస్తోంది.
Read More
Next Story