ఏవీ తల్లీ నాటి ఎర్ర జెండాల రెపరెపలు..
బెంగాల్ లో చాలాకాలం అధికారం చెలాయించిన వామపక్ష పార్టీ నేడు ఉనికి కోసం పోరాడుతున్నాయి. తాజాగా రాష్ట్రం లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో పార్టీ ఓట్ షేర్..
పశ్చిమ బెంగాల్.. ఒకప్పటి వామపక్షవాదానికి కంచుకోట. దాదాపు మూడు దశాబ్ధాలు ఏకఛత్రాదిపత్యంతో రాష్ట్రాన్ని పాలించింది. అయితే ఇదంతా గత వైభవం. ప్రస్తుతం బెంగాల్ లో ఈ ఎర్రజెండా పార్టీ ఉనికి కోసం పోరాడుతూ ఉంది. తాజాగా బెంగాల్ లో ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
కొన్ని రోజుల క్రితం బెంగాల్ లోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన క్రూరమైన అత్యాచారం, హత్య తరువాత బెంగాల్ లో జరిగిన అన్ని నిరసనలకు ప్రధానంగా నేతృత్వం వహించింది లెప్ట్ పార్టీనే. ఈ పరిణామం తిరిగి తమపై ప్రజల్లో ఆదరాభిమానలు పెంపొంది రాజకీయంగా లాభిస్తుందని పార్టీ భావించింది.
కానీ ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అనుకున్నంత ప్రభావం చూపలేకపోతోంది. జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెను మమతా బెనర్జీ రెండు గంటల పాటు చర్చలు జరిపి ముగించేలా చేశారు. ఉప ఎన్నికల్లో ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది.
లెఫ్ట్ ఫ్రంట్ కోల్పోయింది..
మొదటిసారిగా సిపిఐ (ఎంఎల్)ని తన గ్రూపులోకి చేర్చుకున్న లెప్ట్ కూటమి ఉప ఎన్నికల సమయానికి ఆర్జీకర్ ఆస్పత్రి వ్యవహారం పెద్ద ఉద్యమంగా మారుతుందని దాని నుంచి తమకు రాజకీయ లాభాలు వస్తాయని ఆశించింది. కానీ ప్రస్తుతం ఉప ఎన్నికల పోటీ మమతా బెనర్జీ, బీజేపీ మధ్యే నెలకొని ఉంది.
ఇది ఎర్రజెండా పార్టీలకు శరాఘాతంగా మారింది. ఇప్పుడే కాదు 2019 నుంచి జరుగుతున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ- తృణమూల్ కాంగ్రెస్ మధ్యే జరుగుతున్నాయి. వీరికి కనీసం ఓట్లు కూడా రావట్లేదు. ఆ పార్టీకి గడచిన రెండు లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. అసెంబ్లీలో కూడా సీట్లు రాలేదు.
అయితే గతేడాది జరిగిన ‘సాగర్‌దిగి’ ఉప ఎన్నిక మాత్రమే లెప్ట్ పార్టీలకు ఊరట కలిగించే విషయం. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి బేరాన్ బిస్వాస్ కు వామపక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కానీ గెలిచిన వెంటనే బేరాన్ బిస్వాస్ తృణమూల్ కాంగ్రెస్ లో చేరాడు.
బీజేపీ ప్రశ్నలు..
రాష్ట్రంలో జరిగిన ఆందోళనలపై బీజేపీ కూడా అనుమానం వ్యక్తం చేసింది. వీటి వెనక వామపక్ష పార్టీలతో పాటు అల్ట్రా లెప్ట్ వింగ్ ల హస్తం ఉందని, కోల్ కతలో గందరగోళాన్ని సృష్టించడమే వారి లక్ష్యమని ఆ పార్టీ నేత దిలీప్ ఘోష్ ప్రశ్నలు సంధించారు. ఇది కూడా పార్టీపై మైనస్ పడటానికి కారణమైంది.
“ ఈ ఆందోళనల వల్ల ప్రజలు ఏం లబ్ధి జరిగింది ? ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులను మరింత భద్రంగా మార్చడంలో విజయం సాధించిందా? అని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రశ్నించారు.
టీఎంసీ చాకచక్యంగా..
జూనియన్ డాక్టర్లు చేస్తున్న ఆందోళనలను టీఎంసీ చాకచక్యంగా వ్యవహరించి ముగించిందని వామపక్ష నేతలు అంతర్గంగా అంగీకరిస్తున్నారు. ఇందులో తమ నాయకత్వ వైఫల్యం కూడా ఉందని పరోక్షంగా అంగీకరించారు.
ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పోరాటపటిమతో ఒప్పించింది. ఆందోళనకారులతో ముఖ్యమంత్రి స్టాయిలో రెండు సమావేశాలు కింది స్థాయిలో కనీసం ఆరు సమావేశాలు నిర్వహించింది.
ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీతో జరిగిన సమావేశంలో పేదలు ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రుల పై ఆధారపడి ఉన్నారని వారి సమస్యలు ప్రస్తావిస్తూనే వారిని మెత్తపరిచారు. తరువాత మెల్లగా జూడాల డిమాండ్లను అంగీకరించారు. తెలివిగా వ్యవహరించి సమ్మెను ముగించేలా చాణక్యం ప్రదర్శించారు. "సమావేశం ప్రత్యక్ష ప్రసారం ఒక మాస్టర్ స్ట్రోక్" అని రాజకీయ వ్యాఖ్యాత అమల్ సర్కార్ అభిప్రాయపడ్డారు.
వైద్యుల డిమాండ్లు
వైద్య విద్యను పర్యవేక్షిస్తున్న అన్ని ఇతర కమిటీల పనితీరును పర్యవేక్షించేందుకు ఐదుగురు వైద్యులు - ఐదుగురు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన రాష్ట్ర స్థాయి అపెక్స్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆందోళన చేస్తున్న వైద్యుల ప్రధాన డిమాండ్లలో ఇదీ ప్రధానమైనది. ఆసుపత్రుల పనితీరును పర్యవేక్షించేందుకు వైద్యుల తగిన ప్రాతినిధ్యంతో కళాశాల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్న మరో కీలక డిమాండ్‌కు కూడా అంగీకరించింది.
2025 మార్చి నాటికి విద్యార్థి సంఘాల ఎన్నికలను నిర్వహించడం, ప్రభుత్వ ఆసుపత్రుల భద్రతను పటిష్టం చేసేందుకు సరిపడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల కోసం రెఫరల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి పడకల కేటాయింపులో ఉన్న మధ్యవర్తులను తొలగించడం వంటి మరికొన్ని డిమాండ్‌లు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి నారాయణ్ స్వరూప్ నిగమ్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో సహ ప్రస్తుత పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్‌ను రద్దు చేయాలనే డిమాండ్లును ప్రభుత్వం అంగీకరించలేదు. వైద్యులు తమ అధికార పరిధిని అతిక్రమించవద్దని గుర్తు చేశారు. అలాగే బాధితురాలికి న్యాయం చేయాలని కూడా కోరుతూనే ప్రస్తుతం కేసు సీబీఐ పరిధిలో ఉందని చెప్పారు. ఇలా వామపక్ష ఆశలపై మమతా సర్కార్ నీళ్లు చల్లింది.
ఓట్ల షేర్ పెరగడం..
నిరసనల వల్ల ఉప ఎన్నికల్లో పోటీ త్రిముఖంగా లేదు. ఉత్తర బెంగాల్‌కు చెందిన సిపిఐ (ఎం) నాయకుడు మాట్లాడుతూ.. ‘‘ ఉప ఎన్నికలు జరుగుతున్న సీతాయ్, మదారిహత్ లో ఓట్ షేర్లను మెరుగుపరచడానికి ప్రధానంగా దృష్టి పెడుతున్నాం, ఇదే మాకు అతిపెద్ద విజయం’’ అన్నారు.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు, కాంగ్రెస్ కూటమి మదారిహట్‌లో 4.24 శాతం, సీతాయ్‌లో 1.66 శాతం ఓట్లు మాత్రమే సాధించాయి. మరో నాలుగు స్థానాల్లో కూడా పనితీరు సరిగా లేదు. నైహతిలో కూటమికి 10.11 శాతం ఓట్లు వచ్చాయి. మేదినీపూర్‌లో 5.43 శాతం, తల్దంగ్రాలో 11.41 శాతం. బీజేపీకి దక్కిన మదారిహట్ మినహా మిగిలిన అన్ని స్థానాలను టీఎంసీ గెలుచుకుంది.
ఆరు స్థానాల్లో, వామపక్షాల నేతృత్వంలోని కూటమి పోటీ చేయాలని భావిస్తున్న ఏకైక సీటు, నార్త్ 24-పరగణాల్లోని మైనారిటీ ప్రాబల్యం ఉన్న హరోవా అసెంబ్లీ స్థానం మాత్రమే. లెఫ్ట్ ఫ్రంట్‌తో పొత్తు పెట్టుకుని ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) ఈ స్థానంలో పోటీ చేస్తోంది. ISF 21.73 శాతం ఓట్లతో 2021లో TMC తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్‌లు ఉప ఎన్నిక కోసం పొత్తు పెట్టుకోలేదు. కానీ పరిస్థితులు మాత్రం వామపక్షాలకు అనుకూలంగా లేదు.
Next Story