నా కుమార్తెలు నా దగ్గరికి రావడం మానేశారు: కోల్‌కతా నిందితుడి తల్లి
x

నా కుమార్తెలు నా దగ్గరికి రావడం మానేశారు: కోల్‌కతా నిందితుడి తల్లి

నా కుమారుడిని హత్య, అత్యాచారం కేసులో ఇరికించారని కోల్‌కతాలోని ఆర్ జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితుడి తల్లి..


కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు సంజయ్ రాయ్ తల్లి దగ్గరికి ఆమె నలుగురు కుమార్తెలు రావడం మానేశారని, అలాగే తన కొడుకు అరెస్ట్ అయిన తరువాత తాను ఇప్పటి వరకూ తాను చూడలేదని అన్నారు.

ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. తన కుమార్తెలు తనను విడిచిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనతో మాట్లాడటం లేదని, ఇంటికి రావడం కూడా మానేశారని చెప్పారు.
తన కుమారుడిని కలవడానికి తనను ఎవరూ తీసుకెళ్లలేదని, కోర్టులో అప్పీల్ ఎలా వేయాలో తనకు తెలియదని చెప్పింది. సంజయ్ కాలేజీ గ్రాడ్యుయేట్ అని, స్కూల్‌లో ఎన్‌సిసి క్యాడెట్ అని ఆమె చెప్పారు. అతను తనను జాగ్రత్తగా చూసుకుంటాడని, తన కోసం భోజనం కూడా వండి పెట్టేవాడని పేర్కొంది.
నాలుగు పెళ్లిళ్లు
నిందితుడు సంజయ్ రాయ్ కి నాలుగు పెళ్లిళ్లూ సహ, అతని ప్రవర్తన, ముగ్గురు భార్యలు విడిచిపెట్టడం, ఇరుగూ పొరుగు వారితో గొడవలకు దిగడం, తాగి ఇంటికి రావడం వంటి అన్ని ఆరోపణలను ఆమె ఖండించింది. తన కొడుకు ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదని చెప్పింది.
సంజయ్ మొదటి భార్య మంచి అమ్మాయి. వారు కలిసి సంతోషంగా ఉన్నారు. కానీ ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో కొడుకు డిప్రెషన్‌కు గురై మద్యం తాగడం ప్రారంభించాడని ఆమె తెలిపారు. ఆమె అతనికి మద్యపాన అలవాటు నుంచి ప్రయత్నించానని, బదులుగా టీ తాగమని సలహ ఇచ్చేదానినని పేర్కొంది. అతనికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాని పేర్కొంది.
సంఘటన జరిగిన రాత్రి
ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో సంజయ్ చేస్తున్న పని గురించి తనకు ఏమీ తెలియదని, అతని నుంచి ఎలాంటి అసాధారణ ప్రవర్తనను ఎప్పుడూ గమనించలేదని సంజయ్ తల్లి చెప్పింది. ఘటన జరిగిన రోజు రాత్రి అతడు భోజనం చేయలేదని, ఆస్పత్రికి వెళ్తున్నానని మాత్రమే చెప్పిందని గుర్తు చేసుకుంది.
తన కొడుకును ఎవరో చాలా తెలివిగా నేరంలో ఇరికించారని అనుమానం వ్యక్తం చేశారు. “ఎవరైనా అతనిని ఇరికించినట్లయితే, ఆ వ్యక్తి శిక్షించబడతాడు. నా కొడుకు నేరం చేసి ఉంటే దేవుడు శిక్షిస్తాడు” అని నిందితుడి తల్లి చెప్పింది. ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో పనిచేసిన సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్, నేరం జరిగిన ప్రదేశంలో దొరికిన సిసిటివి ఫుటేజీ, బ్లూటూత్ హెడ్‌సెట్ ఆధారంగా అరెస్టు చేశారు.
Read More
Next Story