‘‘బిజూ గుర్తులను ఒడిశా ప్రజల మదిలో నుంచి తొలగించలేరు’’
x

‘‘బిజూ గుర్తులను ఒడిశా ప్రజల మదిలో నుంచి తొలగించలేరు’’

పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మార్చి 5 నుంచి ఏప్రిల్ 24కు మార్చడంపై మాజీ సీఎం నవీన్ పట్నాయ్ ఆగ్రహం


ఒడిశాలో పంచాయతీ రాజ్ దివాస్ తేదీను మార్చడంపై మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బిజూ పట్నాయక్ అయిన మార్చి 5ను పంచాయతీ రాజ్ దినంగా జరుపుకునేవారు. అయితే గత ఏడాది అధికారంలోకి వచ్చిన బీజేపీ తాజాగా పంచాయతీరాజ్ దివస్ ను ఏప్రిల్ 24 కి మార్చింది.

ఈ సంఘటనపై మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఒడిశాలో గౌరవనీయుడైన బిజూ పట్నాయక్ ను అవమానించే విధంగా ఉన్నాయన్నారు. బిజూ వారసత్వాన్ని క్రమపద్దతిలో తుడిచిపెట్టడానికి బీజేపీ చేస్తున్నకుట్రగా మేము భావిస్తున్నామని ఆయన అన్నారు. ‘‘ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి.. కానీ బిజూ బాబు ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు’’ అని నవీన్ పట్నాయక్ అన్నారు.
సమర్థించుకున్న బీజేపీ..
బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బిస్వాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యను సమర్థించుకున్నారు. ఏప్రిల్ 24, జాతీయ స్థాయిలో పంచాయతీ రాజ్ రోజుగా గుర్తిస్తున్నారని, 73 సవరణ ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్దమైన గుర్తింపు లభించిందని అన్నారు.
అయితే ఈ మార్పుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశాయి. గురువారం రాష్ట్ర వ్యాప్త నిరసనను నిర్వహించాలని పిలుపునిచ్చాయి. బిజూ పట్నాయక్ వదిలిపెట్టిన వారసత్వాన్ని అగౌరవపరిచేలా ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చాలామంది ప్రతిపక్ష నాయకులు భావిస్తున్నారు.
బిజూ పట్నాయక్ వారసత్వం..
రాష్ట్ర ప్రభుత్వం చేసిన మార్పులను వ్యతిరేకిస్తూ మార్చి5న బిజూ పట్నాయక్ పుట్టినరోజు జరుపుకున్న తరువాత మార్చి 6 నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనను బీజేపీ సీనియర్ నాయకుడు సంబయ్ దాస బర్మా పిలుపునిచ్చారు.
భారత్ లో మొదటిసారి మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను అమలు చేసిన తొలి నాయకుడు బిజూ పట్నాయక్ అని ఆయన గావ్ కామా(గ్రామాల్లో ఉద్యోగాల లభ్యత) అనే నినాదాన్ని ఇచ్చారని బర్మా చెప్పారు.
బిజూ సంస్కరణలు..
ఒడిశాలో బిజూబాబు అనేక సంస్కరణలకు ఆద్యుడు. ముఖ్యంగా మహిళా విద్యకు ప్రాధాన్యం ఇచ్చాడు. ‘‘మా కు సమ్మాన్’’(మహిళలను గౌరవించండి) అనే నినాదాన్ని ఇచ్చారు. మహిళలకు సాధికారత కల్పించి, గ్రామ స్థాయిలో కల్పించి గ్రామ స్థాయిలో విధాన రూపకల్పనలో నిమగ్నమయ్యే ఒడిశా అలాగే భారత్ అభివృద్ది చెందని పట్నాయన్ భావించేవారని బర్మా అన్నారు.
పంచాయతీ రాజ్ వ్యవస్థలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లను రిజర్వ్ చేసిన తొలి రాష్ట్రం ఒడిశా అని, పట్నాయక్ మూడు చట్టాలను ఆమోదించడం ద్వారా మహిళలలకు తొలిసారిగా 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని అన్నారు.
ఇందులోనే ఒడిశా గ్రామపంచాయతీ (సవరణ) చట్టం, ఒడిశా పంచాయతీ సమితి(సవరణ) చట్టం, ఒడిశా జిల్లా పరిషత్ (సవరణ) చట్టం. ఇది పట్నాయక్ తీసుకున్న విప్లవాత్మక చర్య అని ఆయన అన్నారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో కుటుంబ మూలాలు..
బిజూ పట్నాయక్ భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబంలో జన్మించారు. బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో పోరాడుతున్న భారత సైనికులపై క్విట్ ఇండియా ఉద్యమ కరపత్రాలను విమానంలో జారవిడిచారు. ఆయన జేపీ నారాయణ్, ఆర్ ఎం, లోహియా, అరుణా అసఫ్ అలీ వంటి స్వాతంత్య్ర సమరయోధులకు ఆశ్రయం కల్పించారు.
బ్రిటిష్ వారు పట్నాయక్ ను అరెస్ట్ చేసి రెండు సంవత్సరాలు జైలులో పెట్టారు. 1945 లో జైలులో నుంచి విడుదల అయ్యాక, 1946 లో ఒడిశా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తరువాత ఒడిశా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మరణం తరువాత నవీన్ పట్నాయక్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పేరు మీదే పార్టీ పెట్టి ప్రజల మన్నలలను పొందారు.
విగ్రహం ధ్వంసం..
ఈ రాజకీయ వివాదం కొనసాగుతుండగానే కటక్ లోని బిజూ పట్నాయక్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని మాజీ సీఎం విచారం వ్యక్తం చేశారు.
‘‘చరిత్రను తిరిగి రాయడానికి ఏ ప్రయత్నాన్ని ఒడిశా ప్రజలు సహించరు. బిజూ బాబు వారసత్వం ఎప్పటికిటీ ఒడియాలకు గర్వకారణంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
రాష్ట్ర కార్యక్రమాలను బహిష్కరించిన నవీన్..
రాష్ట్ర ప్రభుత్వం చర్యల పట్ల అసహనం వ్యక్తం చేసిన మాజీ సీఎం, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిపిన బిజూ పట్నాయక్ 109 వ జయంతిని బహిష్కరించారు. పంచాయతీ రాజ్ దివాస్ అంశంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నవీన్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వనించారు.
కానీ ఈ కార్యక్రమానికి రావడానికి ఆయన విముఖత వ్యక్తం చేశారు. అలాగే ఇద్దరు బీజేడీ ఎమ్మెల్యేలు అనంత నారాయణ్ జెనా, సుశాంత్ కుమార్ రౌత్ , మేయర్ సులోచన దాస్ జయదేవ్ భవన్ లో జరిగిన కార్యక్రమాన్ని బహిష్కరించారు.
బీజేపీ ప్రభుత్వం బిజూ పట్నాయక్ జయంతి సందర్భంగా పంచాయతీ రాజ్ దివస్ పాటించకుండా ఆపడం ద్వారా ఆయనను అగౌరవపరిచింది. ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వనించడం లాంఛనప్రాయమే’’ అని బీజేడీ సీనియర్ నాయకుడు దేబీ ప్రసాద్ మిశ్రా అన్నారు.
కాంగ్రెస్ ఏమన్నదంటే..
ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వారు ఒడిశా వ్యవస్థాపకుడు మధుబాబును గౌరవించలేదు. బిజూ పట్నాయక్ జీని అగౌరపరుస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ఒడిశా సంస్కృతిలో జోక్యం చేసుకుంటోంది. బీజేపీ పాలక బీజేపీకి బానిసలా ప్రవర్తిస్తోంది’’ అని అన్నారు.
Read More
Next Story