పాండియన్ కు, పార్టీకి సంబంధం లేదు: నవీన్ పట్నాయక్
x
ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, వీకే పాండియన్

పాండియన్ కు, పార్టీకి సంబంధం లేదు: నవీన్ పట్నాయక్

బీజేడీలో వీకే పాండియన్ కు వ్యతిరేకంగా సమావేశమైన వ్యతిరేక గ్రూపు


రాజ్యసభలో వక్ప్ సవరణ బిల్లుకు మద్దతు విషయంలో చివరి నిమిషంలో బీజేడీ తన వైఖరి మార్చుకోవడంలో ఆ పార్టీలో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నిర్ణయంపై బీజేడీ శ్రేణుల్లో అసంతృప్తి చెలరేగుతుండగా, సీనియర్ నాయకులు, యువజన బృందం పాండియన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాండియన్ పది నెలల క్రితం అధికారికంగా రాజకీయాల నుంచి నిష్క్రమించినప్పటికీ పార్టీ తీసుకుంటున్న కీలక నిర్ణయాలను మాత్రం ప్రభావితం చేస్తూనే ఉన్నారని, పార్టీలో విభజనను తీవ్రతరం చేశారని ఆరోపిస్తున్నారు.

అయితే ఈ మాజీ అధికారిని బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ మరోసారి సమర్థించడంతో వీకే పాండియన్ మరోసారి వార్తల్లో నిలిచాడు.

వక్ప్ బిల్లులో పరిణామాలు..
బీజేడీ మొదట్లో వక్ఫ్ బిల్లును వ్యతిరేకించింది. కానీ రాజ్యసభలో ఆత్మప్రభోదానుసారం ఓటింగ్ లో పాల్గొనాలని నిర్ణయం తీసుకుంది. పట్నాయక్, బీజేడీ వక్ప్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ చివరి క్షణంలో నిర్ణయం మార్చుకోవడం చాలా మంది పార్టీ సీనియర్లకు నచ్చలేదు.
పార్టీ మారిన వైఖరిని ఎక్స్ ద్వారా పోస్ట్ చేసిన పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సస్మిత్ పాత్రాపై చర్య తీసుకోవాలని పలువురు బీజేడీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై పార్టీలో అంతర్గత దర్యాప్తు జరగాలని పట్నాయక్ ను కోరారు.
ఇలా నిర్ణయం మారడంలో పాండియన్ హస్తం ఉందని పార్టీ సీనియర్లు ఆరోపిస్తున్నారు. అయిత పార్టీ పనితీరులో పాండియన్ కు ఎలాంటి పాత్ర లేదని పట్నాయక్ స్పష్టం చేశారు.
‘‘కార్తికేయన్ పార్టీకి మాత్రమే కాకుండా రాష్ట్రానికి కూడా ఎంతో మంచి చేశారు. ఆయనకు ఇక ముందు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత, పాత్ర లేదు’’ అని బీజేడీ చీఫ్ ప్రకటించారు. అతను పది నెలల క్రితమే పార్టీని విడిచిపెట్టాడని, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని అన్నారు.
పెరుగుతున్న విభేదాలు..
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ప్రధాన ఆఫీస్ కాకుండా ప్రయివేట్ గా ఒక హోటల్ సమావేశం అయ్యారు. ఈ పరిణామంతో నవీన్ పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని సమావేశాలు పార్టీ కార్యాలయంలోనే జరగాలని వారికి గుర్తు చేశారు. అయితే పార్టీ అసమ్మతివాదులు మాత్రం పాండియన్ కు అనుకూలంగా ఓ శిబిరం పనిచేస్తోందని, వెంటనే పరిస్థితి నియంత్రించాలని లేఖ రాశారు. ఆ శిబిరం పార్టీ పునర్మిణాలను అడ్డుకుంటుందని ఆరోపించారు.
లౌకిక గుర్తింపు ప్రమాదం..
వక్ప్ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ముస్లిం సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుందని పార్టీ లౌకిక వాద వైఖరితో రాజీపడిందని వారు ఆరోపిస్తున్నారు. నవీన్ పట్నాయక్ అధికారిక నివాసం అయిన నవీన్ నివాస్ వెలుపల ‘‘పాండియన్ హటావో, బీజేడీ బచావో ’’ వంటి నినాదాలు చేస్తున్నారు. ఇది పార్టీలో గందరగోళానికి దారి తీసింది.
బీజేడీ లౌకిక మూలాలను పట్నాయక్ పునరుద్ఘాటించి పాండియన్ వివాదం నుంచి పక్కకు తప్పుకోవాలని కోరుతున్నప్పటికి నవీన్ పట్నాయక్ మౌనం పాటిస్తున్నాడు.
విభేదాలు రచ్చకెక్కిన కొద్ది అందరి దృష్టి బీజేపీ అధినేత తీసుకోబోయే చర్యలపైనే ఉంది. ఆయన అంతర్గత సమతులత్యను పునరుద్దరిస్తారా? లేదా అని సంశయంగా మారింది.
Read More
Next Story