‘వందే భారత్’ స్లీపర్ సేవలు ప్రారంభం
x
వందే భారత్ స్లీపర్ రైలు

‘వందే భారత్’ స్లీపర్ సేవలు ప్రారంభం

మాల్దా నుంచి జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ


భారత రైల్వేలో అపూర్వ ప్రజాదరణ పొందిన ‘వందే భారత్’ రైళ్ల సర్వీస్ లో మరో అంకం మొదలైంది. ఇన్నాళ్లు కేవలం కూర్చుని వెళ్తున్న వందే భారత్ లో ఇక నుంచి స్లీపర్ సేవలను పొందవచ్చు. తాజాగా హౌరా- గువహాటి(కామాఖ్య) మధ్య తొలి వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగాల్ లో జెండా ఊపి ప్రారంభించారు.

విమానంలో ప్రయాణించినట్లు..
ఆధునిక భారత్ లో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చాడానికి వందే భారత్ స్లీపర్ సేవలను ప్రభుత్వం డెవలప్ చేసింది. తక్కువ చార్జీతో ఎయిర్ లైన్స్ వంటి సేవలను వందే భారత్ అందిస్తుందని పీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఈ రైలులో సుదూర ప్రయాణాలను వేగంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా అందిస్తుందని పేర్కొంది. ‘‘హౌరా- గువహాటి మార్గంలో ప్రయాణ సమయాన్ని దాదాపు 2.5 గంటలు గణనీయంగా తగ్గించడం ద్వారా ఈ రైలు మతపరమైన ప్రయాణం, పర్యాటక రంగానికి కూడా పెద్ద ఊతం ఇస్తుంది’’ అని పీఎంఓ తన ప్రకటనలో పేర్కొంది.
ప్రాజెక్ట్ లకు శంకు స్థాపన..
మాల్దాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్న మోదీ, బెంగాల్, ఇతర ఈశాన్య రాష్ట్రాలలో కనెక్టివిటీని బలోపేతం చేయడం, అభివృద్ధిని వేగం చేయడమే లక్ష్యంగా రూ. 3,250 కోట్ల విలువైన బహుళ రైలు, రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లను శంకుస్థాపన చేయడంతో పాటు దేశానికి అంకితం చేయనున్నారు.
2026 అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభం అయిన తరుణంలో తూర్పు భారతంలో రెండు రోజుల పాటు మోదీ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం బెంగాల్ తో పాటు ఏడాది చివరలో అస్సాం లోనూ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవి హై ఓల్టేజ్ రాజకీయ విమర్శలకు దారి తీసే అవకాశం ఉంది.
Read More
Next Story