బెంగాల్ టీచర్లకు మోదీ గాలం
x

బెంగాల్ టీచర్లకు మోదీ గాలం

బెంగాల్ లో నిర్వహించిన టీచర్ నియామక పరీక్షలో అవకతవకలు జరిగినట్లు హైకోర్టు నిర్ధారించి ఈ పరీక్షను రద్దు చేసింది. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు.


స్కూల్ సర్వీస్ కమిషన్ (SSC) కుంభకోణంలో కోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన " ఉపాధ్యాయులు, అభ్యర్థులకు" సాయం చేయడానికి ప్రత్యేక లీగల్ సెల్‌ను ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ బిజెపి యూనిట్‌ను ఆదేశించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.

బర్ధమాన్-దుర్గాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. ‘అవినీతికి పాల్పడిన వారికి శిక్ష పడాలని తాను కోరుకుంటున్నప్పటికీ, అయితే ఇదే సమయంలో అమాయకులు బాధపడకూడదని’ అన్నారు. బెంగాల్‌లో స్కూల్ రిక్రూట్‌మెంట్‌లో టిఎంసి చేసిన అవినీతి సిగ్గుచేటు.
ఈ కుంభకోణం వల్ల అనేక మంది నిజమైన అభ్యర్థులు నష్టపోయారు. ప్రత్యేక లీగల్ సెల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయాలని పార్టీ తరపున బెంగాల్ బిజెపి యూనిట్‌ను కోరాను. నిజమైన అభ్యర్థులు, ఉపాధ్యాయులకు సాయం అందించండి" అని ఆయన అన్నారు. ఇలాంటి నిజాయితీపరులైన అభ్యర్థులకు బీజేపీ మద్దతిస్తుందని, వారికి న్యాయ సాయం అందజేస్తుందని, వారి కోసం, వారి తరఫున పోరాడుతుందని, ఇది మోదీ హామీ అని అన్నారు.
కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ-ప్రాయోజిత ఎయిడెడ్ పాఠశాలల్లో రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష-2016 (SLST) నియామక ప్రక్రియను రద్దు చేసిన వారం తర్వాత మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశాలతో దాదాపు 26,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
Read More
Next Story