పశ్చిమ బెంగాల్‌:  కృష్ణానగర్ లో రాజమాత vs వివాదాల రాణి
x

పశ్చిమ బెంగాల్‌: కృష్ణానగర్ లో రాజమాత vs వివాదాల రాణి

బెంగాల్ లో వివాదస్పద ఎంపీ మహూవా మెయిత్రాపై బీజేపీ బలమైన ప్రత్యర్థిని రంగంలోకి దింపింది. బెంగాల్ రాజకుటుంబంలోని రాజమాత అమృతరాయ్ కు టికెట్ ఇచ్చింది.


అధికార బీజేపీపై వరుస ప్రశ్నలు సంధిస్తూ తరువాత క్వాష్ ఫర్ క్వరీ వివాదంలో ఇరుక్కుని ఎంపీ పదవీపొగొట్టుకున్న మహువా మొయిత్రాపై బీజేపీ గట్టి ప్రత్యర్థిని నిలబెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో మెహూవా మొయిత్రాని లోక్ సభ లో అడుగు పెట్టకుండా ఉండాలని బెంగాల్ రాజకుటుంబానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టింది. మార్చి 25న విడుదల చేసిన బీజేపీ ఐదవ జాబితాలోని 111 మంది పేర్లలో, కృష్ణనగర్‌లోని ' రాజ్‌బరీ ' (బెంగాలీ పదం రాజభవనం) రాజమాత అమృతా రాయ్‌ను నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. నదియా రాజకుటుంబానికి చెందిన రాయ్ గత వారం పార్టీలో చేరారు.

బీజేపీ మాస్టర్ స్ట్రోక్
ఈ సారీ బెంగాల్ లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని వాంఛిస్తున్న కమలదళం.. అందుకోసం బలమైన ప్రత్యర్థులపై అంతే బలమైన లోకల్ వ్యక్తులను ఎంపిక చేసుకుంటోంది. ప్రస్తుత అమృత రాయ్ పేరును కూడా స్థానిక నాయకత్వమే పార్టీ అగ్రనాయకత్వానికి సూచించిందని సమాచారం. వారే రాజమాతను పోటీ చేయడానికి ఒప్పించారని టాక్. అమృత రాయ్‌ను రంగంలోకి దింపడం బిజెపి మాస్టర్‌ స్ట్రోక్‌గా పలువురు భావిస్తున్నారు. మొయిత్రా గెలుపు ఈ సారి నల్లేరుపై నడక కాదని ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి.
2019లో మొయిత్రా..
గత ఏడాది చివర్లో 'అనైతిక ప్రవర్తన' కారణంగా లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన మొయిత్రా.. 2019 లో కృష్ణానగర్ నుంచి ఎన్నికయ్యారు. బీజేపీ ప్రత్యర్థిపై కేవలం 63, 218 ఓట్ల తేడాతో గెలిచారు.
మొయిత్రాకు 6,14,872 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ చౌబేకి 5,51,654 ఓట్లు వచ్చాయి. చిట్ ఫండ్ స్కామ్‌లో జైలుకు వెళ్లినందుకు సిట్టింగ్ ఎంపీ తపస్ పాల్‌ను కాదని మహూవాను ఇక్కడ టికెట్ ఇచ్చి టీఎంసీ నిలబెట్టింది. అయితే ఈ ఎన్నిక మహూవాకు ప్రతిష్టాత్మకం కానున్నాయి. అంతకుముందు ఇదే స్థానం సీపీఎంకు కంచుకోట. 2009లో తపస్ పాల్ ఇక్కడ టీఎంసీ తరఫున గెలిచాడు.
అమృతా రాయ్ ఎవరు?
అమృతారాయ్, కృష్ణానగర్‌లోని నదియా రాజ కుటుంబానికి చెందినది. నియోజకవర్గానికి చెందిన 'రాజ్‌బారి రాజమాత' (రాజభవనానికి రాణి తల్లి).బ్రిటీష్ పాలనకు ముందు మహారాజా కృష్ణ చంద్ర రాయ్ 55 సంవత్సరాలు బెంగాల్ లో పాలించారు. తరువాత వీరి కుటుంబం పాలన పగ్గాలు చేపట్టి మంచి పేరు పొందారు.ఈ వారసత్వం కారణంగా నదియా రాజ కుటుంబం నేటికీ బెంగాల్‌లో గౌరవం పొందుతోంది. భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా బెంగాల్‌లో ప్రముఖ వ్యక్తి, కృష్ణ చంద్ర 18వ శతాబ్దంలో తన తెలివైన దూరదృష్టి గల పాలకుడిగా ప్రసిద్ధి చెందాడు. అతను అనేక పరిపాలనా సంస్కరణలను అమలు చేయడం, కళలు, బెంగాలీ సంస్కృతిని ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందాడు.
తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత, రాయ్ ఆనందబజార్ తో ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ, ‘నదియా చరిత్రకు కృష్ణచంద్ర రాజు చేసిన సేవల గురించి అందరికీ తెలుసునని, భారతదేశంలో చేర్చుకోవడంలో కృష్ణనగర్ రాజకుటుంబం పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుందని ఆశిస్తున్నాను. తాను రాజ‌కీయ కోడ‌లుగా కాకుండా సాధార‌ణ ప్ర‌జ‌ల గొంతుక‌గా ఉండ‌డానికే రాజ‌కీయ రంగ ప్రవేశం చేస్తున్నాను’ అని మీడియాతో అన్నారు.
TMC మహువా మొయిత్రా..
పార్లమెంటేరియన్‌గా, మహువా మొయిత్రా తన తొలి లోక్ సభ ప్రసంగంలో వెలుగులోకి వచ్చింది, ఆమె భారతదేశంలో ఫాసిజం "ప్రారంభ సంకేతాలను" వివరించింది. సోషల్ మీడియా ఈ ప్రసంగాన్ని సంవత్సరపు మేటీగా పేర్కొంది . తరువాత బీజేపీని పదే పదే విమర్శించి లైమ్ లైట్లోకి వచ్చింది. పార్లమెంట్‌లో అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగినందుకు మరో పారిశ్రామికవేత్త నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ వ్యవహారాన్ని ఆమె సన్నిహితుడు బయటపెట్టడంతో పెద్ద కలకలం చెలరేగింది. బహిరంగ ఖండనలు, విచారణ తర్వాత, 'క్యాష్-ఫర్-క్వరీ' కేసులో మోయిత్రా నాలుగు నెలల క్రితం లోక్‌సభ నుంచి బహిష్కరించబడ్డారు. అయినప్పటికీ, మమతా బెనర్జీ ఆమెను తొలగించడాన్ని "ప్రజాస్వామ్యపు హత్య"గా అభివర్ణించి అండగా నిలబడింది. ప్రతిపక్షాలు కూడా ఆమెకు అండగా నిలిచాయి. మళ్లీ భారీ మెజారిటీతో లోక్ సభకు తిరిగి వస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసింది. కానీ కృష్ణానగర్ లో త్రిముఖ పోటీ ఉంది. ఇక్కడ టీఎంసీ, బీజేపీ, సీపీఎం బరిలో నిలిచాయి.
1967 లో కృష్ణా నగర్ నియోజకవర్గం ఏర్పాటు అయింది. ఇక్కడ వివిధ పార్టీలు ఆధిపత్యం ప్రదర్శించాయి. మొదట్లో సీపీఎం పార్టీ ఇక్కడ తన పట్టును ప్రదర్శించింది. తరువాత నటుడు, రాజకీయరంగంలోకి వచ్చిన తపస్ పాల్ విజయం సాధించాడు. ఇలా ఇక్కడ జరిగిన 12 ఎన్నికల్లో 9 సార్లు సీపీఎం, మూడు సార్లు 3 టీఎంసీ విజయం సాధించింది. అతను 2009, 2014లో తన ప్రధాన ప్రత్యర్థి, సీపీఎం అభ్యర్థిని రెండుసార్లు ఓడించాడు. 2019లో మొయిత్రాను బరిలోకి దింపినప్పుడు, చోప్రా, పలాషిపరా, కలిగంజ్ అసెంబ్లీలు ఆమెకు ఏకపక్షంగా ఓట్లు పొందారు. దాంతో విజయం సాధించారు.
కృష్ణానగర్‌లోని మెజారిటీ ఓటర్లు గ్రామీణ (87 శాతం), హిందూ (55 శాతం), ముస్లిం (35 శాతం) వర్గాల నుంచి గణనీయమైన ప్రాతినిధ్యం ఉంది. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) ఓటర్లు కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తారని నివేదికలు తెలిపాయి.
కృష్ణానగర్‌లో బీజేపీకి అనుకూలం ఏమిటి?
రాయల్ కార్డ్ ప్లే చేయడంతో పాటు, గత ఐదేళ్లలో, బీజేపీ కలిగంజ్ అసెంబ్లీలో బలపడింది. తృణమూల్ కాంగ్రెస్ సంస్థాగత బలాలు బలహీనపడింది. అంతేకాకుండా, అవినీతి ఆరోపణలు, అంతర్గత పోరు వంటి సవాళ్లను TMC ఎదుర్కొంటోంది. అయితే ఇవన్నీ కూడా మహూవా మొయిత్రా గెలుపును అడ్డుకుంటాయా? తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటుందా? ప్రజా తీర్పు ఎటువైపు ఉంటుందో?
Read More
Next Story